Jagan: జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!

వైసీపీలో జగన్‌ నిర్ణయానని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్‌ ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు.

New Update
Jagan: జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!

ఏపీ రాజకీయాలు  (Ap politics) నిమిషానికి ఓ తీరుగా మారుతున్నాయి. కచ్చితంగా ఈసారి సీటు వస్తుంది అనుకున్న వారికి సీటు రాకపోవడంతో పార్టీ పెద్దల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నేతలు. దీంతో కొందరు బహిరంగంగానే పార్టీ అధిష్టానం నిర్ణయాలను తప్పు పడుతుంటే.. మరికొందరు మాత్రం తమకు అనుకూలంగా ఉన్నవారి వద్ద వారి బాధలను చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలో తమకు సీటు రాదు అని భావించిన నేతలు పక్క పార్టీలోకి జంప్‌ లు కూడా అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పక్క పార్టీల తీర్థం పుచ్చేసుకున్నారు కూడా. ఈ క్రమంలోనే గుంటూరు(Gunturu)  జిల్లా తాడికొండలో అధికార పక్షం వారు సాధికార సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ (Dokka manikyavaraprasad)హాట్‌ కామెంట్స్‌ చేశారు. గతంలో ముఖ్యమంత్రి నేను అడగకుండానే తాడికొండ ఇన్‌ ఛార్జీగా నియమించారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో నన్ను పక్కన పెట్టాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో జగన్‌ నిర్ణయానని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని ఆయన అన్నారు.

వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్‌ (Jagan) ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో డొక్కా పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019 లో సుచరిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే సుచరితను తాడికొండ ఇన్‌ ఛార్జీగా జగన్‌ నియమించారు. అయితే అధిష్టానం నోట ఎక్కడా కూడా డొక్కా ప్రస్తావనే లేదు. దీంతో డొక్కా పరిస్థితి ప్రస్తుతం దిక్కు తోచకుండా ఉంది. ఒకనాడు సర్వేలు నిర్వహించడంతో నన్ను అక్కడి సమన్వకర్తగా నియమించారు..కానీ ఇప్పుడు అక్కడ అప్పటి పరిస్థితులు లేకపోవడంతో జగన్‌ నన్ను పక్కన పెట్టేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయినా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ లేదని, కానీ ఒక్కసారి జగన్‌ను చూడాలని ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also read: ఆ రోజున మీ ఇళ్లలో దీపాలు వెలిగించండి..ప్రజలకు ప్రధాని విజ్ఙప్తి!

Advertisment
తాజా కథనాలు