Carrots Tips: ఇలా చేస్తే క్యారెట్లు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి

ఏ కాలమైనా సరే హెల్దీ డైట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో క్యారెట్ జ్యూస్ చాలా మంచిది. క్యారెట్‌లో విటమిన్-సి పుష్కలం చర్మానికి ఉపయోగకరం ఉంటుంది. క్యారెట్లు ఎండిపోయినా.. వాడిపోయినా గిన్నెలో క్యారెట్లు మునిగే వరకు నీరు పోసి క్యారెట్లనూ 12 గంటలు ఉంచితే అవి ఫ్రెష్‌గా ఉంటాయి.

Carrots Tips: ఇలా చేస్తే క్యారెట్లు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి
New Update

Tips to keep carrots fresh:  క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే చర్మానికి మెరుపు ఇచ్చి అందంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, క్యారెట్‌లో పీచు ఎక్కువగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే క్యారెట్లను రోజూ తెచ్చుకోవడం వీలుకాదు కాబట్టి ఒక్కసారి తెచ్చుకొని నిల్వ చేసుకుంటారు. అయితే ఇలా నిల్వ చేసుకుంటే త్వరగా వాడిపోతాయి. కొన్ని కూరగాయలని నిల్వ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఇవి పాడైపోతుంటాయి. అయితే.. క్యారెట్లు వాడిపోకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవి ఫాలో అయితే క్యారెట్లను ఫ్రెష్‌గా నిల్వ చేసుకోవచ్చు. క్యారెట్లను ఇప్పుడు ఫ్రెష్‌గా ఎలా నిల్వ చేసుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
క్యారెట్లు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి

  • క్యారెట్లు ఎండిపోయినా.. వాడిపోయినా కానీ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి క్యారెట్లు మునిగే వరకు నీరు పోయాలి. తర్వాత ఈ గిన్నెని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా పెట్టినా క్యారెట్లను 12 గంటల తర్వాత తీసి చూస్తే అవి ఫ్రెష్‌గా ఉంటాయి. అప్పుడు వాటిని తొక్క తీసి మంచిగా వాడుకోవచ్చు. అంతేకాకుండా క్యారెట్ల మీద నల్ల మచ్చలు ఉంటే కూడా ఈ చిట్కా మంచిగా పనిచేస్తుంది.
  • క్యారెట్ తినడం వల్ల కంటి చూపు, కంటికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. క్యారెట్ తింటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
  • వీటితోపాటు పాల గిన్నెలు, డబ్బాలు కూడా వాసన వస్తూ ఉంటాయి. వాటిని ఎంత కడిగినా కూడా ఆ వాసన పోదు. ఇలాంటప్పుడు పాల డబ్బాలో వంటసోడా కొన్ని నీళ్లు పోసి రాత్రి అంతా ఉంచాలి. ఉదయం బాటిల్ని కడిగితే పాల వాసన పోతుంది.
  • క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఉపయోగపడుతుంది. వీటిని తింటే క్యాన్సర్ ప్రమాదం నుంచి బయట పడుతాం.
  • అంతేకాకుండా పాల డబ్బాలో కొద్దిగా వెనిగర్ వేసి షేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత వేడి నీటితో కడిగితే వాసన పోతుంది

క్యారెట్‌ అతిగా తింటే కొన్ని నష్టాలు

  • క్యారెట్‌లను ఎక్కువగా తింటే పొట్ట సమస్యలు వస్తాయి.
  • క్యారెట్‌లను ఎక్కువగా తింటే నిద్రలేమి కలుగుతుంది.
  • చర్మ సంబంధిత సమస్యలు ఉంటే క్యారెట్ తినకూడదు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఈ ఆహారాలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ పరార్

#tips #carrots-fresh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe