చెన్నైలో 29 మందిని కరిచిన ఓ కుక్కను అక్కడి స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. రోయపురంలోని మంగళవారం సాయంత్రం కేవలం రెండు గంటల్లోపే ఆ కుక్క 29 మందిని కరిచింది. అయితే దానికి రేబీస్ వ్యాధి సోకినట్లు స్థానికులు అనుమనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కుక్క దాడికి గురైన 29 మందిలో 5 గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కుక్క జీఏ రోడ్డుపై సంచారం చేస్తూ.. అక్కడినుంచి వెళ్లే వారిని కరిచినట్లు అక్కడివారు తెలిపారు. దీంతో ఆ కుక్క ఇంకా మరింత మందిని కరిచే ప్రమాదం ఉందనే కారణంతో స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. అయితే ఈ ఘటనపై వెటర్నరీ అధికారులు స్పందించారు. అయితే ఆ కుక్కకి రేబీస్ సోకిందా లేదా అనే విషయం ఇంకా తెలియలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ కుక్కును మద్రాస్ వెటర్నరీ కళాశాలలో పోస్టుమార్టం కోసం పంపించామని.. వాటి రిపోర్ట్స్ వచ్చాక అసలు ఆ కుక్కకు ఏం జరిగిందో చెప్పగలమని పేర్కొన్నారు.
Also Read: ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్.. లోకల్ బాయ్ నానిని విడుదల
మరోవైపు ఈ కుక్క వల్ల గాయాలపాలైనవారికి ఇప్పటికే యాంటీ రేబీస్ మొదటి డోస్‌ను ఇచ్చామని.. అలాగే మరికొన్ని డోసులు కూడా ఇస్తామని తెలిపారు. అయితే వాళ్లందరిని వైద్యులు డిశ్చార్జి చేశారని.. ప్రస్తుతం వారి పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే చైన్నై మున్సిపల్ కార్పోరేషన్.. ఆ కుక్క కరిచిన ప్రాంతంలో ఉన్న మరో 25 కుక్కలను, 5 కుక్క పిల్లలను అదుపులోకి తీసుకోని ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నట్లు చెన్నై వెటర్నరీ అధికారి తెలిపారు. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 16 జోన్లలో ప్రతిరోజూ 80 నుంచి 90 కుక్కలను పట్టుకుంటుంది. అయితే ఈ ఏడాది స్టేరిలైజేషన్ కోసమని ఏకంగా 17 వేల శునకాలను పట్టుకుంది. అలాగే వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కూడా వేసేలా చర్యలు తీసుకుంది.