Water Chestnut Benefits: చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం

చలికాలంలో సింఘాడ పండును తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్- సి, ఎ, మాంగనీస్ వంటి పోషకాలు మలబద్ధకం, హైబీపీ, గుండె, చర్మ సమస్యలు, డయాబెటిస్‌ వంటివి రాకుండా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.

New Update
Water Chestnut Benefits: చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం

Water Chestnut Benefits: చాలా మందికి సింఘాడ అంటే తెలిదు. చలికాలంలో వచ్చే వాటర్ చెస్ట్‌నట్ దీనిని సింఘాడ అని పిలుస్తారు. ఈ సింఘాడ రుచిగా ఉంటుంది. దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేదుకు ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్- సి, ఎ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. కావునా.. వాటర్ చెస్ట్ నట్స్ తింటే ఆర్యోగానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం.

సింఘాడ తింటే కలిగే ప్రయోజనాలు:

  • సింఘాడలో కాల్షియం, మాంగనీస్, డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, సి, కాపర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో దీన్ని తింటే ప్రేగు కదలిక ప్రక్రియ, మలబద్ధకం, జీర్ణక్రియ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • వాటర్ చెస్ట్‌నట్‌లో కాల్షియం, పొటాషియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచుటంతోపాటు.. హైబీపీ రోగులకు, గుండె జబ్బులకు ఎంతో మేలు చేస్తోంది. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
  • వాటర్ చెస్ట్‌నట్ ఉండే లారిక్ యాసిడ్ మూలాలను జుట్టుకు బలం చేకూరుతుంది. ఇందులో ఉండే పొటాషియం, జింక్, విటమిన్ బి, ఈ వంటి అనేక పోషకాలు జుట్టు పెరుగుదలకు, చర్మ సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగిచి మంచి ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.
  • చలికాలంలో చాలామంది ప్రజలు తక్కువ నీటిని తాగుతారు. ఇది తిన్న తర్వాత మనకు చాలా సేపు కడుపు నిండిన అనుభూతి ఉండి.. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడానికి ఇదిబాగా పనిచేస్తుంది. ఈ వాటర్ చెస్ట్‌నట్‌లో నీరు సమృద్ధిగా ఉంటుంది.. ఇది తింటే డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.
  • సింఘాడలో ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుంది. చాలా తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ఆహారంలో చేర్చుకోవచ్చు. దీన్ని తింటే కడుపు నిండుగా ఉండి ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు తగ్గడానికి మంచి ఎంపిక.
  • వాటర్ చెస్ట్‌నట్ తింటే డయాబెటిస్‌ బాధితులను ఎంతో మేలు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహం నియంత్రణలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: దాల్చిన‌చెక్క, నిమ్మకాయ‌ను ఇలా తీసుకుంటే చాలు.. బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు