Sleep Time: ప్రస్తుత కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆహారపు అలవాటు, శారీరక శ్రమలతో పాటు నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఎదుగుదలతోపాటు శరీరం, మనస్సు బాగా పనిచేయడానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తూ, హార్మోన్ నియంత్రణలో ఉంచేదుంకు సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. అయితే.. నేటి కాలంలో ప్రతి ఒక్కరి నిద్ర భిన్నంగా ఉంటుంది. చాలామంది ఎక్కువ నిద్రపోతే.. కొంతమంది తక్కువ నిద్రపోతారు. నిద్ర ఎక్కువగా జీవనశైలి, వయస్సు, వైద్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి వయసులో మంచి నిద్ర అవసరమని నిపుణులు అంటున్నారు. కానీ ఏ వయసులో ఎంత నిద్రపోవాలో చాలా మందికి తెలియదు. అయితే ఏ వయస్సులో ఎంత నిద్రపోవాలో అనేదానిపై కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నిద్రపోవాటానికి సరైన సమయం:
- 0 నుంచి 3 నెలల నవజాత శిశువుకు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం. వారి అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. శిశువు బాగా ఎదుగుతోందనడానికి ఇది సంకేతం.
- 4 నుంచి 11 నెలల వయస్సు ఉన్న పిల్లలు ప్రతిరోజూ 12-15 గంటలు నిద్రపోవాలని నిపుణుల చెబుతున్నారు. దీని కారణంగా పిల్లల శరీరం వేగంగా, బాగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
- 1-5 ఏళ్ల పిల్లలు పెద్దయ్యాక నడవడం, ఆడుకోవడానికి ఆలవాటు పడుతారు. అలాంటి వాటికి శక్తి అవసరం, మెదడు సరిగ్గా పని చేస్తుంది. అందువల్ల పిల్లలుకు కనీసం 11 నుంచి 14 గంటల పాటు నిద్రపోతే మంచిది.
- 3 నుంచి 5 ఏళ్ల వయస్సు పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి.. వీరు నేర్చుకునే దశలో ఉంటారు కాబట్టి .. వారికి చాలా విశ్రాంతి ఎక్కువగానే అవసరం. అలాంటి పిల్లలు కనీసం 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి.
- 6 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలు పాఠశాలకు వెళ్తుంటారు. వారి శరీరం అభివృద్ధి చెందాలంటే ఈ కాలంలో కనీసం 9-12 గంటలు నిద్రపోతే పిల్లల ఎత్తు పెరుగుతారని నిపుణులు సలహా ఇస్తారు.
- 13 నుంచి 17 ఏళ్లంటే టీనేజ్. ఈ పిల్లలలో కొత్త అభిరుచులతో పెరిగే వయస్సు. పిల్లలు ఎక్కువ సమయం కొత్త విషయాలను నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంలో గడుపుతారు. ఈ సమయంలో..చదువులు, ఒత్తిడి కూడా వారిపై ఉంటుంది. ఇలాంటి వారు 8 నుంచి 10 గంటల వరకు తగినంత నిద్ర అవసరమని చెబుతున్నారు.
- 18 నుంచి 60 ఏళ్లు వయస్సువారంటే పెద్దలు. ఎక్కువ సమయం పని, కుటుంబ బాధ్యతల మధ్య తగినంత లేక, ఒత్తిడితో ఉంటారు. ఇలాంటి వారు కనీసం 9 గంటలు నిద్రపోతే మంచిది.
- 61 కంటే ఎక్కువ వయస్సుపెరిగే కొద్దీ వారిలో పని సామర్థ్యం తగ్గుతుంది. చాలా మంది వృద్ధులు శారీరక సమస్యలతో కూడా పోరాడుతూ, సరిగ్గా నడవలేరు. అలాంటి వారు కనీసం 8 గంటల నిద్ర తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రైస్ కుక్కర్‌లో అన్నం వండే అసలైన పద్ధతి ఇదే..!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.