Ghee Benefits And Side Effects For Weight Loss : ప్రతి ఇంట్లో దాదాపు నెయ్యి(Ghee) ని ఉపయోగిస్తారు. చాలామంది భోజనంలో నెయ్యి ఒక భాగం. ఇది పూర్తిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు(Omega 3 Fatty Acids), యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఇప్పుడు బరువు తగ్గడానికి(Weight Loss) ప్రయత్నించేవారు తీసుకుంటారు. అయితే బరువు తగ్గడానికి నెయ్యి నిజంగా పని చేస్తుందా? నెయ్యిని బరువు తగ్గేందుకు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వెయిట్ లాస్ కోసం నెయ్యిని ఎలా తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన జీర్ణక్రియ
సమర్థవంతమైన పోషక శోషణ, వ్యర్థాలను తొలగించడానికి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ చాలా అవసరం. ఇలాంటి ఫలితాల కోసం మీరు నెయ్యి తీసుకోవచ్చు. దీనిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మొత్తం జీర్ణక్రియకు చాలా మంచిది. శరీరం పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. తద్వార పరోక్షంగా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
రోగ నిరోధక శక్తికై..
నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫుల్‌గా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తి(Immunity Power) ని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా దీనిలో విటమిన్ ఎ,ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తి పెరగడం, చర్మ ఆరోగ్యం, కాల్షియం శోషణతో సహా వివిధ ప్రయోజనాలు అందించడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి. ఇది బరువు తగ్గడానికి చాలా అవసరం.
కడుపు నిండుగా ఉండేందుకు..
నెయ్యిలో సంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్ కొవ్వులు, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు మీ కడుపు నిండుగా ఉండడంలో సహాయం చేస్తాయి. మీరు తెలియకుండా ఎక్కువగా తినేస్తున్నారు.. ఎక్కువగా ఆకలి వేస్తుందనుకున్నప్పుడు మీ డైట్లో నెయ్యిని కలిపి తీసుకోవచ్చు. ఇది మీరు ఎక్కువ సేపు కడుపు నిండేలా చేసి.. అనవసరమైన ఫుడ్ తీసుకోకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
థైరాయిడ్ పనితీరుకై..
మీరు థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దానివల్ల మీరు బరువు పెరుగుతుంటే మీరు మీ డైట్లో నెయ్యి చేర్చుకోవచ్చు. నెయ్యి అయోడిన్‌కు మూలం. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును ప్రోత్సాహిస్తుంది. అదనంగా దీనిలో థైరాయిడ్ పనితీరుకు తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు జీవక్రియ, శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయం చేస్తాయి. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : ఈ కాలంలో హీట్ స్ట్రోక్ కేసులే కాదు.. బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి.. జాగ్రత్త సుమా!
నెయ్యిని తీసుకోవడం కలిగే దుష్ప్రభావాలు
నెయ్యిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే.. కచ్చితంగా కొన్ని ఉన్నాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియకు మద్ధతిస్తాయి. బరువు నియంత్రణను ప్రోత్సాహిస్తాయి. కానీ నెయ్యిలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. దాని వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ.. నెయ్యి అధిక వినియోగం వల్ల బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి నెయ్యిని మితంగా తీసుకుంటే బరువు తగ్గడానికి మంచిదవుతుంది. అలాగే బరువు తగ్గడంలో నెయ్యి అందరికీ హెల్ప్ కాదు. కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు ఉన్నప్పుడు నెయ్యిని తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.
బరువు తగ్గేందుకు నెయ్యిని ఎలా తీసుకోవచ్చు..
బరువు తగ్గడానికి నెయ్యిని తీసుకునేటప్పుడు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇతర నూనెలు, వెన్నకు బదులుగా దీనిని వంటల్లో చేర్చుకోవచ్చు. కానీ కంట్రోల్‌గా వాడాలి. దీని చపాతీలకోసం, సూప్‌లలో, పప్పులలో కలిపి తీసుకోవచ్చు. కిచిడి, పసుపు పాలలో కూడా నెయ్యి తీసుకోవచ్చు.