Sugar : అన్నం తింటే షుగర్ వస్తుందా..? దక్షిణ భారతదేశంలో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడమే కష్టం. అయితే వరి అన్నం తినడం వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు. By Durga Rao 17 May 2024 in Latest News In Telugu New Update షేర్ చేయండి Blood Sugar : దక్షిణ భారతదేశం(South India) లో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడమే కష్టం. అల్పాహారం(Breakfast) నుంచి పిండివంటల వరకు చాలా వంటలలో బియ్యంతో చేసిన పదార్ధాలు కనిపిస్తాయి. పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు బియ్యంతో వండిన పదార్థాలనే చాలా ప్రాంతాలలో తినిపిస్తారు.ఇక పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో సైతం బియ్యంతో చేసిన రక రకాల పదార్థాలు వడ్డిస్తారు.ఆలయాలలో దేముడికి సమర్పించే నైవేద్యాలలో, పంచే ప్రసాదాలలో కూడా పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి బియ్యంతో చేసే పదార్ధాలే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికిపైగా ప్రజలకు వరి అన్నం ప్రధాన ఆహారం.ఇంత ప్రాముఖ్యమున్న వరి అన్నం తినడం(Eating Rice) వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు.ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాలలో నివసించే ప్రజలకు మరింత ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపింది.ప్రజల ఆహారంలో ప్రధానమైన అన్నం చక్కెర వ్యాధికి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతుంటే అన్నం తినాలో వద్దో అనే అనుమానాలు తలెత్తుతాయి. ప్రకృతిలో సహజంగా లభించే ఏ ఆహార పదార్ధమైనా ఆరోగ్యానికి మంచిదేననీ, కానీ, దానిని ప్రకృతి నుంచి వేరు చేసి తినే ప్రక్రియలో వాటి సహజత్వాన్ని నాశనం చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.పొట్టు తీయని బియ్యం ఆరోగ్యానికి హానికరం కాదని ఆయన అన్నారు. “బ్రౌన్ రైస్(Brown Rice) స్వల్ప మోతాదులో తినేసరికే ఆకలి తీరిపోవడం వలన ఎక్కువ తినలేరు. అదే, పాలిష్ చేసిన బియ్యం అయితే ఎక్కువ తినగలుగుతారు. అలా ఎక్కువ తినడం వల్ల శరీరంలోకి వెళ్లే కార్బోహైడ్రేట్ల శాతం కూడా పెరిగిపోతుంది. అలా అని మార్కెట్లో లభించే సెమీ బ్రౌన్ రైస్ వల్ల కూడా ఎలాంటి మేలు జరగదు” అన్నారాయన. మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు తిన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది కానీ, వారు చేసినంత పని మనం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించి చూసుకోవాల్సి ఉందని చెప్పారు.“పీచుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరంలోకి చేరే గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది” అని ఆయన చెప్పారు.అన్నం మాత్రమే శత్రువు కాదని, అన్నం మానేసి నాలుగు సార్లు నాలుగు స్పూన్ల చక్కెరతో టీ తాగినా, మరో రకమైన చక్కెరతో కూడుకున్న పదార్ధాలు తీసుకున్నాఅది మరింత ప్రమాదం అని” ఆయన అన్నారు. #blood-sugar #south-india #eating-rice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి