Family: కుటుంబానికి ఎక్కువ దూరమైతే ఆయుష్సు తగ్గుతుందా? ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా, చదువుల పరంగా చాలామంది ఎక్కువ కాలంపాటు ఆత్మీయులను, కుటుంబాన్ని, స్నేహితులను చూడలేకపోతున్నారు. వీరిల్లో కుటుంబానికి ఎక్కువ దూరమైతే వ్యక్తి ఆయుష్షు తగ్గటంతోపాటు గుండె జబ్బులు, అనారోగ్యాలు, త్వరగా మరణానికి దగ్గరైనట్లు పరిశోధకులు కనుగొన్నారు. By Vijaya Nimma 14 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Family: చాలా మందిని అనారోగ్యానికి గురిచేస్తున్న సమస్యల్లో సామాజిక ఒంటరితనం కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా, చదువుల పరంగా చాలామంది ఎక్కువ కాలంపాటు ఆత్మీయులను, కుటుంబాన్ని, స్నేహితులను చూడకపోతున్నారు. అయితే ఇలాంటి వారిపై కొన్ని పరిశోధలు చేశారు స్కాట్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు. అయితే.. ఇందులో కుటుంబానికి ఎక్కువ దూరమైతే వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. వీరిల్లో పర్సనల్ ఇంటరాక్షన్స్, పరస్పర సామాజిక చర్యలు వంటివి లేకపోవడంపై ఆధ్యనం చేశారు. దీనివలన డెత్‌రిస్క్ మధ్య గల సంబంధాన్ని కనుగొన్నారు. చదువులు, సోషల్ ఫ్యాక్టర్స్ మానవ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై పరిశోధన చేశారు. కానీ.. ఇది డెత్ రిస్క్‌తోనూ ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు. ఆయుష్షు తగ్గడానికి కారణాలు ఇవే.. నేటి కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్న స్నేహితుల సంఖ్య పెరిగిపోయింది. సోషల్ ఈవెంట్స్‌కు అటెండ్ అయ్యే వారి కంటే.. కుటుంబ సభ్యులు , ఫ్రెండ్స్‌తో ఉండే భౌతికపరమైన సోషల్ కనెక్షన్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. పరస్పర ఇంటరాక్షన్ వల్ల మనం ఎలా అనుభూతి చెందుతామనే దానిని బట్టి కూడా ఫలితాలున్నాయి. ముఖ్యంగా కుటుంబం, ఆత్మీయుల పరస్పర పలకరింపులు, సామాజిక చర్యలకు దూరమైన వారిలో ఆయుష్షు తగ్గడం, గుండె జబ్బులు, అనారోగ్యాలు, రుగ్మతలు వస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇది కూడా చదవండి: చిరాకు వెంటనే పోవాలంటే ఈ పండ్లు తినండి..వెంటనే ఫలితం అయితే.. సామాజిక పరస్పర చర్యకు సంబంధించిన పలు కీలక అంశాలను స్టడీ చేశారు పరిశోధకులు. ఇందులో కుటుంబ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండటం, ఒంటరితనం పర్సనల్ ఫీలింగ్స్, సామర్థ్యం, స్నేహితులు, ఇంటరాక్ట్ అవడం, మాట్లాడటం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం లాంటి అంశాలున్నాయి. అయితే.. ఇందులో చాలా మంది సంగ వయస్సు వారు 50 ఏండ్లపై ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంటరాక్షన్, లేని వ్యక్తుల డెత్ రిస్క్ 49 శాతం పెరుగుతున్నట్లు ప్రధాన పరిశోధకుడు హమీష్ ఫోస్టర్ నేతృత్వంలోని నిపుణులు యూకే బయోబ్యాంక్‌లో గుర్తించారు. ఒంటరిగా ఎవరితోనూ ఇంటరాక్షన్ లేకుండా ఉన్నవారిపై కూడా రీసెర్చర్స్ ఎనలైజ్ చేశారు. అయితే.. ఇలా 12 ఏండ్లకుపైగా స్టడీచేసిన రీసెర్చర్స్ మరణానికి గల కారణాలను తెలిపారు. ఇందులో ఒంటరితనం, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సందర్శన, స్నేహితులు, పలకరింపులు దూరం వంటి చర్యలు లేకపోవడం కారణంగానే త్వరగా మరణానికి దగ్గరైనట్లు పరిశోధకులు కనుగొన్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #life-expectancy #family-shorten మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి