Couple Tips: కోపం వైవాహిక జీవితంలో చిచ్చు పెడుతుందా?..ఇలా తగ్గించుకోండి

భార్యాభర్తలు అనుబంధం చిరకాలం సాగాలంటే ప్రేమ, నమ్మకం ఉండాల్సిందే. ఒకే సమస్యపై ఇద్దరూ పదే పదే గొడవ పడటం వల్ల సంబంధాలు నాశనమవుతాయి. ఒకరికి కోపం వస్తే మరొకరు సర్దుకుపోతే ఇద్దరికీ మంచిది. సమస్యను పరిష్కరించడం మీకు కష్టంగా ఉంటే ఇంట్లో పెద్దల నుంచి సలహాలు తీసుకోవాలి.

New Update
Couple Tips: కోపం వైవాహిక జీవితంలో చిచ్చు పెడుతుందా?..ఇలా తగ్గించుకోండి

 Couple Tips: సంబంధాలకు ప్రేమ, విశ్వాసం పునాది. అనుబంధాలు చిరకాలం సాగాలంటే ఇవి ఉండాల్సిందే. అదే సమయంలో అనుమానం, అపార్థం, కోపం మన సంబంధాలను నాశనం చేస్తాయి. కోపంలో ఒక్క మాట అంటే చాలు కొందరు జీవితాంతం శత్రువులుగా మారిపోతారు. అందుకే కోపాన్ని నియంత్రించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మితిమీరిన కోపం ప్రమాదమా?

భార్యాభర్తల్లో ఎవరికైనా మితిమీరిన కోపం ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒకరికి కోపం వస్తే మరొకరు సర్దుకుపోవడం మంచిది. కొన్నిసార్లు కోపంతో మాట్లాడే మాటలు అవతలి వ్యక్తిలో కూడా కోపం తెప్పిస్తాయి. అప్పుడు ఇద్దరిలో ఈగోలు తారాస్థాయికి చేరుతాయి. ఒక్క క్షణంలో వారిలో ఉన్న ప్రేమ ఆవిరి అవుతుంది. అయితే చాలాసార్లు భర్త కోపానికి భార్యే బాధ్యత వహిస్తుంది. భర్త అదే తప్పును మళ్లీ పునరావృతం చేస్తే భార్య భర్త లోపాలను అందరికి చెప్పడం, నెరవేర్చలేని అనవసరమైన డిమాండ్లు చేయడం చేస్తుంటుంది. కొంతమంది భార్యలు అయితే భర్త కోపాన్ని మరింత పెంచుతారు. పాత విషయాలను ప్రస్తావిస్తూ గొడవను పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే తెలివైన భార్యలు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా భర్తపై రివైంజ్‌ తీర్చుకుంటారు.

భర్త అలవాట్లే భార్య కోపానికి కారణమా?

భర్త చేసే పనులు, అలవాట్లు కూడా భార్యల కోపానికి కారణమౌతాయి. ఒకే సమస్యపై ఇద్దరూ పదే పదే గొడవ పడటం వల్ల కూడా సంబంధాలు నాశనం అవుతాయి. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలనుకుంటే మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి?

భర్త లేదా భార్యలో ఎవరైనా ఏదైనా విషయంపై కోపంగా ఉంటే ఈ గొడవను ముగించడానికి సులభమైన మార్గం అవతలి వ్యక్తి ప్రశాంతంగా ఉండటమే. కోపం తగ్గిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకరి లోపాలను మరొకరు ప్రశ్నించవద్దు. గొడవకు అసలు కారణమేంటో కూర్చుని మాట్లాడుకోవాలి. మీ భాగస్వామి అభిప్రాయాన్ని కూడా గౌరవించడం చాలా ముఖ్యం. కోపాన్ని నియంత్రించుకోవడానికి మరొక సులభమైన మార్గం మీరు ఎవరిపైనైనా కోపంగా ఉంటే కాసేపు అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమం.

ఆత్మహత్య బెదిరింపులు వద్దు

మీ మధ్య విభేదాలు, తగాదాలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అందరితో చర్చించడం సరికాదు, కొన్నిసార్లు అలా చేయడం వల్ల కోపం పెరుగుతుంది. వివాదానికి కారణాన్ని అర్థం చేసుకుని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే సరైన మార్గం. ఈ విషయం గురించి ఇతరుల దగ్గర అస్సలు ప్రస్తావించవద్దు. విడిపోవాలన్న నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. సమస్యను పరిష్కరించడం మీకు కష్టంగా ఉంటే ఇంట్లో పెద్దల నుంచి లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: ప్రెగ్నెన్సీ కిట్‌ని ఎలా ఉపయోగించాలి?..ఈ తప్పులు చేయొద్దు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు