Fevers: తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తోన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ డెంగ్యూ, వైరల్ ఫివర్‌లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు.

New Update
Fevers: తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి డెంగ్యూ, వైరల్ ఫివర్‌లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు. విష జ్వరాలు కుటుంబంలో ఒక్కరికి వస్తే క్రమంగా ఇది అందరికీ సంక్రమిస్తుంది. దీంతో ఇంటిళ్లిపాదీ సభ్యులందరూ జ్వరం భారిన పడుతున్నారు. ఈ జ్వరాలు ఏసీ రూమ్‌లో ఉండే వారికి వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఏసీలో పనిచేసే వారికి గాలి బయటకు వెళ్లకుండా గ్లాస్‌లు ఉంటాయి. దీంతో ఏసీ వల్ల అక్కడ వాతావరణం కూల్‌గా ఉండటంతో ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వెల్లడించారు.

దీంతో సిబ్బంది వ్యాధి బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సైతం విష జ్వరాలు విజృంభిస్తునాయి. రైతులు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కానీ వారికి వీటిపై అవగాహన లేకపోవడంతో నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు అధికంగా వ్యాపించి ఈ జ్వరాలకు కారణం అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సైతం విష జ్వరాలు సోకడానికి ప్రధాన కారణం అపరిశుభమైన నీరే అని వైద్యులు తేల్చి చెప్పారు. వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే, వ్యాధులు తమ వద్దకు రావద్దంటే ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో ఉండే కలుషిత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వర్షం పడ్డ అనంతరం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న బాటిళ్లలో కానీ ఇంటి బయట రోడ్ల మధ్య గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలంటున్నారు. రోడ్డు మధ్య గుంతలో నీరు నిల్వ ఉంటే తమకేంటని ఎవరూ భావించవద్దని, ఎవరైనా గుంతలో నీరు లేకుండా చూసుకోవాలని, అనంతరం జీహెచ్‌ఎంసీ సీబ్బందికి సమాచారం ఇచ్చి అక్కడ గుంతలు లేకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలని అంటున్నారు. తమకేందుకులే అని వదిలేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత, జాగ్రత్తలతోనే జ్వరం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు