Health Tips: కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే

చాలా మంది మసాలా వంటకాల్లో నిమ్మరసాన్ని వాడుతారు. ఇలా తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అతిగా మసాలా ఉన్న ఫుడ్‌ తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటే అందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ మసాలా ఘాటును తగ్గిస్తుంది. అప్పుడు మసాలా ఎక్కువగా తింటాం కాబట్టి ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుంది

New Update
Health Tips: కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే

Health Tips: నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసు. శరీరంలో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్‌కు గురికాకుండా నిమ్మరసాన్ని వాడుతారు. ఉదయం పరగడుపునే నిమ్మరసం షర్బత్‌ తాగితే కడుపులో ఉన్న మలినాలు బయటికి వెళ్లి పోతాయి. ఈ నిమ్మరసం తాగితే బాడీని వెంటనే హైడ్రేట్‌ చేస్తుంది. అయితే.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు నిమ్మరసం తోడైతే ఆ ఆహారానికి ఎంతో రుచి వస్తుంది. కానీ.. ఈ నిమ్మరసం కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలుపుకోని తింటే అది విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ నిమ్మరసంతో కలపకూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మరసం కలిపి తాగకుడని పదార్థాలు

  • నిమ్మరసాన్ని పాలలో అస్సలు కలపకూడదు. ఏ రకమైన పాలైనా నిమ్మరసంను కలిపి తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పండుతుంది. నిమ్మరసం, పాలు ఒకేసారి తాగితే గుండెల్లో మంట, వాంతులు అవడం లాంటి సమస్యలు వస్తాయి.
  • చాలామంది మందు తాగేటప్పుడు రుచి కోసం కొన్ని ఫ్రై ఐటమ్స్‌ తింటారు. అయితే రెడ్‌ వైన్‌ తీసుకునేటప్పుడు నిమ్మకాయను తీసుకోవద్దంటున్నారు. నిమ్మరసం వైన్ రుచిని, వాసనను చెడగొట్టి, ఆరోగ్యానికి హాని చేస్తుంది. పెరుగు, చల్ల, పాలతో ఉన్న నిమ్మరసం తీసుకుంటే మంచిది కాదంటున్నారు. పాలతో నిమ్మరసం కలిపితే ఆరోగ్యానికి హానితోపాటు శరీరంలో ఎసిడిటీ వస్తుందని ఆయుర్వేదం వైద్యులు అంటున్నారు.
  • చాలా మంది మసాలా వంటకాల్లో నిమ్మరసాన్ని వాడుతారు. అయితే ఇలా ఉపయోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు. కొందరూ బిర్యానీలు, ఇతర మసాలా ఆహారాల్లో ఘాటును భరించడం కోసం, పుల్లని రుచి కోసం నిమ్మరసాన్ని పిండుకోని తింటారు. ఇలా తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అతిగా మసాలాను ఉన్న ఫుడ్‌ తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటే అందుకో ఉంటే సిట్రిక్‌ యాసిడ్‌ మసాలా ఘాటు తగ్గుతుంది. అప్పుడు మసాలా ఎక్కువగా తింటాం కాబట్టి ఎసిడిటీ వచ్చే ప్రయాదం ఉంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:హోలీ రోజు రంగులు కొడుతున్నారా? మీ ఊపిరితిత్తులు ఫసక్కే!

Advertisment
తాజా కథనాలు