ORS: జర జాగ్రత్త అవి ఓఆర్‌ఎస్ లు కాదు... ప్యాక్ చేసిన డ్రింక్ లే! వేసవి కాలంలో డీ హైడ్రేషన్ నుంచి తట్టుకోవడానికి చాలా మంది ఓఆర్‌ఎస్ లను తాగుతుంటారు. కానీ అవి ఒరిజినల్ ఓఆర్‌ఎస్ లు కాదు అని వాటి తాగడం వల్ల సమస్యలు అధికం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. By Bhavana 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer: వేసవి కాలం (Summer) మొదలైపోయింది. దీంతో పాటే ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా వెనక పెట్టుకుని తీసుకుని వచ్చేస్తుంది. అందులో ముఖ్యమైనది డీ హైడ్రేషన్ (De Hydration). దీని నుంచి తక్షణ చికిత్స పొందేందుకు చాలా మంది ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్స్ (ORS) ను ఆశ్రయిస్తారు. ఈ సమస్య ముఖ్యంగా చిన్నపిల్లలు, కొంచెం వయసున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని ఓఆర్‌ఎస్ లు తాగినప్పటికీ డీ హైడ్రేషన్ సమస్య మాత్రం తగ్గదు... దానికి కారణం అవి ఓఆర్‌ఎస్ లు కాకపోవడమే. అవును నిజమే అవి ఓఆర్‌ఎస్ లు కాదు... ప్యాకేజ్డ్ డ్రింక్ లని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చెమట రూపంలో లవణాలన్ని బయటకు వెళ్లిపోతాయి. ఆ సమయంలో శరీరంలోని నీరు తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. అందుకే వైద్యులు డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఓఆర్‌ఎస్ లు తాగాలని సలహా ఇస్తుంటారు. కానీ దీనిని అదునుగా తీసుకున్న చాలా కంపెనీలు మార్కెట్లోకి వివిధ పేర్లతో ఆకర్షణీయమైన డబ్బాలలో ప్యాక్ చేసి అమ్మేస్తుంటారు. అవి ఒరిజినల్ ఓఆర్‌ఎస్ లు కాదు అని తెలియక చాలా మంది వాటని తాగేస్తుంటారు. దీంతో అవి అధిక స్థాయిలో చక్కెరను కలిగి ఉండడం వల్ల డీ హైడ్రేషన్ ను తగ్గించడం బదులు మరింత పెంచుతాయి. దీని వల్ల ఒంట్లో నీరసం తగ్గుతుందని మన ఓఆర్‌ఎస్ లు తాగితే...లేనిపోని కొత్త సమస్యలు చుట్టుకుంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఓఆర్‌ఎస్ లు ఒరిజినల్ కాదు అని నిరూపించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లను వాడటం వల్ల చిన్నపిల్లలు, పెద్దవారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వీటి గురించి వినియోగదారుల్లో ఇప్పటికైనా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. Also read: కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కి అద్బుతమైన ఔషధం పసుపే! #health #summer #de-hydration #ors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి