DOB on Aadhaar: ఆధార్ కార్డు పని అయిపోయిందా? ఇకపై పనిచేయదా? ఇదిగో క్లారిటీ! ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ ప్రామాణికం కాదని EPFO చెప్పింది. దానిని ఆధార్ కార్డు అందిస్తున్నయూఐడీఏఐ కూడా సమర్ధించింది. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగానూ, రెసిడెన్షియల్ ప్రూఫ్ గానూ ఇప్పటికీ పనిచేస్తుంది. కానీ, పుట్టిన తేదీ కోసం దీనిని ఉపయోగించలేము. By KVD Varma 19 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి DOB on Aadhaar: ఆధార్ కార్డుకు సంబంధించి, పుట్టిన తేదీని అంటే డేట్ ఆఫ్ బెర్త్ అప్ డేట్ చేయడానికి లేదా సరిదిద్దడానికి ఆధార్ కార్డ్ చెల్లుబాటు కాదని EPFO చెప్పింది. దీంతో, అప్పటి నుంచి ఆధార్ కార్డు నిరుపయోగంగా మారుతుందా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. EPFO చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ లిస్ట్ నుంచి అంటే ఆమోదయోగ్యమైన పత్రాల నుంచి ఆధార్ ను మినహాయించింది. ఈ మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. EPFO ఏమి చెప్పిందో అర్థం చేసుకుందాం.. అలాగే మరి దీనిపై యూఐడీఏఐ ఏం చెబుతోంది? ఇంకా ఆధార్ కార్డ్(DOB on Aadhaar) ఎక్కడెక్కడ పనిచేస్తుంది? ఈ వివరాలన్నింటినీ తెలుసుకుందాం. అప్పుడు DOB ఎలా వెలిడేట్ చేస్తారు? EPFO చెబుతున్నదాని ప్రకారం, జనన ధృవీకరణ పత్రం(Date Of Birth) అంటే డేట్ ఆఫ్ బెర్త్ సర్టిఫికెట్ సహాయంతో ఈ మార్పు చేయవచ్చు. అంతేకాకుండా, ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి పొందిన మార్క్‌షీట్ -స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్ -మెడిక్లెయిమ్ సర్టిఫికేట్ -నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు. యూఐడీఏఐ ఏమంటోంది? ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ చెబుతోంది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదు అని స్పష్టం చేసింది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వంచే జారీ అయిన అఫీషియల్ డాక్యుమెంట్. ఇది మీ గుర్తింపు -శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. కానీ పుట్టిన తేదీకి మాత్రం ఇది కొలమానం కాదు. ఎందుకంటే, చాలామంది ఆధార్ నమోదు చేసుకునే సమయంలో పుట్టిన తేదీ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. వేర్వేరు డాక్యుమెంట్స్ (DOB on Aadhaar)ఆధారంగా దీనిని నమోదు చేశారు. దీనివలన పుట్టిన తేదీకి సంబంధించి ఆధార్ ప్రామాణికం కాదని యూఐడీఏఐ అంటోంది. Also Read: నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది ఈ పనులకు ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు బ్యాంకు ఎకౌంట్ తెరవడానికి ఇప్పటికీ ఆధార్ కార్డు అవసరం. పాస్‌పోర్ట్ పొందడానికి ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తారు. ఆధార్ కార్డు లేనిదే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ లభించదు. మొబైల్ నంబర్ -బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి అయింది. ప్రధానమంత్రి జన్-ధన్ యోజన కింద ఖాతా తెరవడానికి ఇప్పుడు ఆధార్ కార్డ్ మాత్రమే అవసరం. ఆధార్ కార్డును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది దేశ పౌరుల గుర్తింపుకు బలమైన రుజువు. Watch this interesting Video: #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి