Relationship: భర్తను స్నేహితుల దగ్గర ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా? ఏమౌతుందో తెలుసుకోండి!! నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాంటి బంధమైనా పచ్చగా ఉంటుంది. భర్త అలవాట్లను వారి స్నేహితుల ముందు చెప్పడం, వాటిని ఎత్తి చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. దీనివల్ల గొడవలు పెరుగుతాయి. భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేయకూడదు. By Vijaya Nimma 30 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Relationship: సాఫీగా సాగితేనే దానిని దాంపత్య జీవితం అంటారు. దంపతుల మధ్య అందమైన బంధం ఉంటేనే జీవితం ప్రేమానురాగాలతో నిండిపోతుంది. అయితే.. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, గొడవలు, ప్రేమ, అలకలు,బుజ్జగింపులు ఈ మధ్యకాలంలో చాలా సహజం. వైవాహిక జీవితంలో ఇవన్నీ భాగమే. కానీ.. నలుగురిలో మాత్రం ఒకరిపై మరొకరు ఎగతాళి చేసుకోవడం అస్సలు మంచి పద్దతి కాదు. ఇలాంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మీ బంధానికి చాలా నష్టం వాటిల్లుతుంది. అయితే.. నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాంటి బంధమైనా పచ్చగా ఉంటుంది. ఆ సమయంలో మరి ఎలా ఉండాలనేది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. భర్త అలవాట్లు దంపతుల మధ్య అనుబంధం బలంగా ఉండాలంటే ముఖ్యంగా ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించాలి. దంపతులు ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే వారి బంధం మరింత బలంగా ఉంటుంది. ఎలా సమయంలో ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా ఆడవాళ్లు భర్త అలవాట్లను వారి స్నేహితుల ముందు చెప్పడం, వాటిని ఎత్తి చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. దీనివల్ల వారు గొడవ పడే అవకాశం కూడా ఉంది. కోపం ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. ఏ విషయంలోనైనా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారి ముందు భర్తపై కోపాన్ని చూపించకండి. ఇలాంటి సమయంలోనే కోపం ఎక్కువగా వస్తుంటుంది. డబ్బు పొదుపు బంధువులు, స్నేహితుల ముందు భర్తను పిసినారి అనకండి. ఎందుకంటే భర్త ఖర్చు చేయనంత మాత్రాన నాలుగురిలో అలా అనడం మంచిది కాదు. కుటుంబంలో ఎవరు సంపాదించినా అది కుటుంబ సంపాదనగానే చూడాలి. భర్త, భార్య, పిల్లల సంపాదన అని వేరువేరుగా లెక్కించకూడదు. బెదిరించడం భర్త వాళ్ల స్నేహితులతో ఉన్నప్పుడు పదే పదే బెదిరిస్తే ఇది రకమైన చెడు ప్రవర్తనే. ఏదైనా సమస్య ఉంటే భర్తను పక్కకు పిలిచి చెప్పండి. అంతేకానీ నలుగురిలో వారిని బెదిరించకండం పద్దతి కాదు. భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేయకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. తను చెప్పిందే వినాలని కండిషన్స్ ఇద్దరికీ మంచిది కాదు. ఇది కూడా చదవండి: చలికాలంలో తరచుగా ఫిష్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #relationship #tips #life-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి