Health Benefits: మొక్కజొన్నలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

ఆరోగ్యాన్ని అందించే మొక్క జొన్న వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటారు. మరి, అవేంటో చూసేద్దామా!

New Update
Health Benefits: మొక్కజొన్నలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

Health Benefits of Corn: మొక్క జొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ E, B1, B6, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ నియాసిన్‌లు ఉంటాయి. ఫైబర్ (పీచు) పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణక్రియకు (Digestion) తోడ్పుడుతుంది.ఫైబర్ మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.మొక్క జొన్న పేగు క్యాన్సర్‌‌ను అరికడుతుంది.వీటిలో బోలెడన్ని మినరల్స్‌ ఉంటాయి. మెుక్కజొన్నను రోజూ తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్‌ బలంగా ఉంటాయి.

మొక్క జొన్నలో ఉండే విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల జుట్టుకు కాంతివంతంగా ఉంటుంది.మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌‌లు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి.అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు  చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.బాగా ఎండిన మొక్కజొన్న విత్తనాల నూనెను చర్మానికి రాసుకోవచ్చు. నూనెలో ఉండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను తగ్గిస్తుంది. విటమిన్‌ C, కేరోటియాయిడ్లు, మయో ప్లేవినాయిడ్లు.. చెడు కొలెస్టరాల్‌ నుంచి గుండెను కాపాడుతాయి.

Also Read: యోగా చేయటం వల్ల ఎన్ని బెన్ ఫిట్స్ కలుగుతాయో మీకు తెలుసా?

మొక్క జొన్న శరీరంలో రక్తప్రసరణ (Blood Circulation) సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు.నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది.పసుపు రంగులో ఉండే మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు