Karthikamasam: కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేస్తారో తెలుసా! కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు, చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు. By Bhavana 25 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మాసం. చాలా మంది ఈ మాసం అన్ని రోజులు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటూ..ఉపవాసాలు చేస్తూ శివారాధనలో ఉంటారు. కార్తీక మాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది..వన భోజనాలు. బంధుమిత్రులందరితో కలిసి తోటల్లో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తుంటారు. ఈ మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తారు. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి , లక్ష్మీ దేవి ఇద్దరు కొలువై ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కార్తీకం అంటే శివకేశవులిద్దరికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఉసిరి చెట్టుకే ఎందుకు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం... ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధాలు దాగి ఉంటాయి. ఈ చెట్టును ధాత్రి వృక్షం అని కూడా అంటారు. ఆ చెట్టులోని ప్రతిది కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. కాయలు వృద్ధాప్య ఛాయలను దగ్గరికీ రానీయకుండా చేస్తాయి. అలాగే జుట్టు సంబంధిత ఔషధాల్లో కూడా ఉసిరి కాయలను వాడతారు. ఉసిరి చెట్టు ఆరోగ్య సంజీవని. ఆ చెట్టు గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. కార్తీక మాసం లో ఈ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పై భాగంలో బ్రహ్మ దేవుడు , ఆకులలో సకల దేవతలు కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే చెట్టు ఉన్న చోట నాలుగు దిక్కులు కూడా దీపాలను వెలిగిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దోషాలు తొలగిపోతాయి. నరదిష్టి కూడా తగలదని కొందరి నమ్మకం. రోజుకోక ఉసిరి కాయను తింటే ఎటువంటి వ్యాధులు దరి చేరవని వైద్యులే తెలిపారు. ఎన్నో అనారోగ్య సమస్యలను ఉసిరి దూరం చేస్తుంది. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం, ఉసిరి పచ్చడి తినడం చేస్తే ఆరోగ్యం, పుణ్యం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. Also read: కుదిరితే రోజూ ఓ కప్పు కాఫీ.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాఫీ..!! #karthikamasam #amla #tree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి