Hinduism: కొందరు హిందువులు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినరు. బ్రాహ్మణులు, వైష్ణవులు జీవితాంతం వాటికి దూరంగా ఉంటారు. భగవద్గీత, ఇతర హిందూ గ్రంధాలు ఈ ఆహారాలు తినకూడదని చెబుతున్నాయి. ఈ ఆహారాలు యోగులకు, సిద్ధులకు, గురువులకు మంచివి కాదని సూచిస్తున్నాయి.ఉల్లి,వెల్లుల్లి తామసిక ఆహారాలుగా పేర్కొన్నారు. ఇవి మనస్సులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని పెంచుతాయని నమ్ముతుంటారు. వీటిని తింటే శృంగార కోరికను పెంచుతాయని చెబుతుంటారు.
భగవద్గీతలో (17.9) శ్రీకృష్ణుడు చేదు, పులుపు, లవణం, వేడి, ఘాటైన, ఆహారాన్ని తినకూడదని హెచ్చరించాడు. మితిమీరిన కోరికలతో జీవించే వారికే ఇవి ఆకర్షణీయంగా ఉంటాయని, ఈ కోరికల వల్ల బాధలు, కష్టాలు, అనారోగ్యం ఏర్పడుతుందని శ్రీకృష్ణుడు వివరించాడు.
హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఉల్లిపాయ వెల్లుల్లి 'తామసిక్' ఆహారాలుగా వర్గీకరించారు.
ఈ ఆహారాలు అజ్ఞానాన్ని పెంచుతాయని నమ్ముతారు. నీరసం, కోపం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు పెరగుతాయని పేర్కొన్నారు.
అందుకే వీటిని 'రజోగుణి' అని కూడా పరిగణిస్తారు అంటే విపరీతమైన కోరికలను కలిగిస్తాయని అర్ధం.
వేదాలు, ప్రాచీన హిందూ గ్రంధాలు ఉల్లిపాయలు, వెల్లుల్లిని తినేవారికి బలమైన భౌతిక శరీరం ఉంటుందని సూచిస్తున్నాయి.
వీరికి శారీరక దారుఢ్యం ఉన్నప్పటికీ మంచి తెలివితేటలు ఉండవని పేర్కొంది. వారికి రాక్షసుల వంటి ప్రాపంచిక, అపవిత్రమైన బుద్ధి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..!