Kalki 2898AD : 'కల్కి' లో కృష్ణుడిగా నటించిన ఇతను ఎవరో తెలుసా? 'కల్కి' మూవీలో కృష్ణుడి పాత్ర ఆడియన్స్ ను ఎంతో ఇంప్రెస్ చేసింది. అయితే ఆ పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా సీన్స్ తీశారు. సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించి ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. By Anil Kumar 28 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kalki 2898AD Movie : ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898AD' మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు. ఈ క్రమంలోనే మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. అందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కర్ణుడిగా ప్రభాస్, ఉత్తరగా మాళవిక నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించారు. అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా సీన్స్ తీశారు. సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే, వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్. Also Read : ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లి దండ్రులు! కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్ కల్కి (Kalki 2898AD) సినిమాలో కృష్ణుడి పాత్రకు తెలుగు, హిందీలో వాయిస్ ఇచ్చారు. సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ (Krishna Kumar) అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించిన కృష్ణ కుమార్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. పలు తమిళ్ సినిమాల్లో నటించాడు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో పైలెట్ గా కనపడ్డాడు. ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ గా నటించాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Krishnakumar (KK) (@kk.actor) #kollywood #kalki-2998-ad #actor-krishna-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి