fermented food: పులియబెట్టిన ఆహారంతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు పూర్వకాలంలో మన పెద్దలు తిన్న భోజనం చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా కెమికల్ వాడిన ఫుడ్ తీనేవాళ్లు కాదు. ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని విలువ చేసుకొని తినే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసుకోని ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 28 Oct 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పూర్వకాలంలో మన పెద్దలు తిన్న భోజనం చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా కెమికల్ వాడిన ఫుడ్ తీనేవాళ్లు కాదు. ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని విలువ చేసుకొని తినే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసుకోని ఎక్కువగా తీంటున్నారు. పూర్వం టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు ఆహార పదార్థాలను బయటపెట్టి పులియపెట్టుకుంటూ సంరక్షించుకునేవారు. దీంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు, సీలింధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్‌గా మార్చేవి. ఇలా చేసినప్పుడు ఆహార పదార్థాలు పులుపుతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనకు ఉపయోగపడేవి.అందుకోసమే ప్రతిరోజు తప్పకుండా పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఆహారంలో ఉండే పోషకాలతో దీర్ఘకాలిక సమస్యలు రావు అసలు పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉండే బ్యాక్టీరియాలు మన శరీరంలో కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడంలో ఉపయోగపడుతాయి. ఫలితంగా మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాలు రక్త ప్రవాహంలోకి సమర్థవంతంగా కలిసిపోయి పేగుల్లో పీహెచ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు పులిసిన ఆహార పదార్థాలను తినటం వల్ల ఉబ్బసం, అల్జీమర్స్, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలు రాకుండా తగ్గించుకోవచ్చు. పుల్లపెట్టిన ఆహార పదార్థాలలో ఎక్కువగా మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. శరీరానికి పోషణ అధికంగా లభిస్తోంది అంతేకాదు.. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీనివల్ల అధిక బరువు కూడా తగ్గటానికి ఛాన్స్ ఎక్కువ. పులిసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతాయి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి పోషణతో పాటు శక్తిని కూడా అందిచడానికి సహాయపడుతుంది. పులియపెట్టిన ఆహార పదార్థాలలో విటమిన్‌లు, ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో మన శరీరానికి పోషణ అధికంగా లభిస్తోంది. వీటిలో ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆహార ఈ ఆహార పదార్థాలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు చాలా దోహదపడతాయి. పులియపెట్టిన ఆహారాల్లో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఎక్కువ. ఇడ్లీ, దోశ,పెరుగు, పన్నీర్ లాంటివి పులియపెట్టిన ఆహార పదార్థాల కిందకు వస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఇలా చేస్తే సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు…ఒకసారి ట్రై చేయండి #helth-benefits #eat #fermented-food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి