కరివేపాకును రోజూ ఖాళీ కడుపుతో తింటే ఏం జరుగుతుందో తెలుసా ? కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి దీనికి ఉంది.మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. By Nedunuri Srinivas 24 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Benefits of curry leaves: కరివేపాకు లేని వంటగదిని ఊహించగలమా ?మనం నిత్యం కూరల్లో,చారులో ,తాలింపులో వాడే కరివేపాకును మనం చాలా చులకనగా చూస్తుంటాం.కూరలోనైనా , మరి దేంట్లోనైనా వేసిన కరివేపాకు తినకుండా తీసిపడేస్తాం. కానీ కరివేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే షాక్ అవడమే కాదు. మీ ఇంటి ముందు కరివేపాకు మొక్క నాటుకుంటారు. రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను నమిలి తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది ఇప్పుడున్న ఆహారపు అలవాట్లవల్లనైతేనేమి , కంప్యూటర్ ముందు కూర్చొని గంటలు గంటలు వర్క్తి చేయడం వల్లనైతేనేమి , విపరీతంగా సెల్ ఫోన్ వాడటంవల్లనైతేనేమి అనేక రకాలయిన కంటి జబ్బులు వస్తున్నాయి. చిన్న పిల్లలకు సైతం చూపు మందగిస్తుంది.స్కూల్ కి వెళ్లే టైంలోనే కళ్ల అద్దాల అవసరం ఏర్పడుతుంది. మరి.. ఇలాంటి కంటి సమస్యలనుంచి కాపాడటం లో కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే కరివేపాకు నమలడం వల్ల మీ కంటి చూపు చాలా వరకు మెరుగుపడుతుంది. రోజూ కళ్లను కడుక్కున్న తర్వాత దీన్ని తినాలి.కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు సంరక్షణ చిన్న వయసులోనే బట్టతల , జుట్టువెరవడం , జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనేక రకాల హెయిర్ ఆయిల్స్ వాడినా సరే ఫలితం కనిపించక చాలా దిగులు పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఆశా జ్యోతి కరివేపాకు. కేశ సంరక్షణ లో కరివేపాకు చాలా మేలు చేస్తుంది. కరివేపాకు తినడం వల్ల మీ జుట్టు పొడవు చాలా పెరుగుతుంది. జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. మీ జుట్టు మృదువుగా మారుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది కరివేపాను పరగడుపునే తినడంవల్ల మన శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ ఆకును నమలడం వల్ల మీ శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉంటుంది.తద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాకపోతే క్రమం తప్పకుండా రోజూ తినాలి. దీన్ని నమలడం వల్ల మీ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గింస్తుంది మీరు బరువు తగ్గాలంటే రోజూ కరివేపాకును తినాలి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా చాలా సహాయకారిగా నిరూపిస్తుంది. ఇక.. స్థూలకాయం తో బాదపడుతుంటే . బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేస్తున్నట్లయితే.. ఒకసారి కరివేపాకును తినడం మొదలుపెట్టి చూడండి. కరివేపాకు రక్తంలో చక్కెర కంట్రోల్ చేయడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులతో కరివేపాకు తీసుకోవాలి. మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం నివారిస్తుంది. కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి దీనికి ఉంది.మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. Also Read:అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? #health-tips #curry-leaves-benefits #curry-leaves మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి