Health Tips: పరగడుపున ఈ జ్యూస్‌ను తాగితే ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహార నియమాలను పాటించాలి. వాటిల్లో కొత్తమీర జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ ఉదయన్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

New Update
Health Tips: పరగడుపున ఈ జ్యూస్‌ను తాగితే ఏమవుతుందో తెలుసా..?

Cilantro Juice Benefits: మనం రోజూ కూరల్లో వాడే కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటల్లో వాసనతో పాటు రుచిని ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తుంది కొత్తిమీర. కొత్తిమీరతో చట్నీ, కొత్తిమీర రైస్, కొత్తిమీర జ్యూస్ వంటివి తయారు చేసుకుని చాలామంది తింటారు. అయితే.. వంటలకే కాదు ఆరోగ్యానికి కూడా కొత్తిమీర జ్యూస్ బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఈ జ్యూస్‌లో దాగి ఉన్నాయి. మరి కొత్తిమీర జ్యూస్‌ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ మీటింగ్‌లో కూలిన టెంట్.. బీఎస్పీ శ్రేణులకు తీవ్ర గాయాలు

ప్రతీరోజు కొత్తిమీర జ్యూస్ తాగితే గాయాలు, దెబ్బలు త్వరగా మానుతాయని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనతతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలో ఈ కొత్తిమీర జ్యూస్ చాలా మంచిది అంటున్నారు. కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ తాగితే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి దంతాలు ఎముకలు దృఢంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఉదయం పూట లేవగానే ఈ జ్యూస్ తాగాలి

శరీరంలో ఉండే కొలెస్ట్రాలను అదుపు చేయడంలో కొత్తిమీర జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు ఈ జ్యూస్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు తోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ జ్యూస్‌ను పరిగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ జ్యూస్ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారుగా.. ఉదయం పూట లేవగానే ఈ జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉండండి. ఈ విషయాలను అవగాహన కోసమే చెబుతున్నాము. మరిన్ని అనారోగ్య సమస్యలు ఉంటే మంచి డాక్టర్లను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిగా మనవి.

Advertisment
Advertisment
తాజా కథనాలు