Food Coma: ఫుడ్ కోమా అంటే తెలుసా..ఎలాంటి నష్టాలు ఉంటాయి..? ఎంతటి పనిలో ఉన్నా నిద్రను ఆపుకోలే పోతే, మధ్యాహ్నం కళ్ళు మూత పడిపోతూ ఉంటే.. ఇది ఓ వ్యసనంలాగో, రుగ్మతలాగో ఉంటే దీనిని ఫుడ్ కోమా అంటారు. పోస్ట్‌ప్రాండియల్ సొమ్నోలెన్స్ అని కూడా అంటారు. ఫైబర్, ప్రోటీన్స్, హెల్తీ ఫుడ్స్, తాజా పండ్లు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. By Vijaya Nimma 10 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Food Coma: ప్రస్తుత కాలంలో నిద్ర ప్రశాంతంగా పోవటం అనేది అందరికీ సాధ్యపడని విషయమని తెలిసింది. కొందరైతే నిద్రపోవటానికి నిద్ర మాత్రలు, యోగాలు, వ్యాయం చేస్తూ ఉంటారు. అయితే.. కొందరిలో రాత్రిపూట నిద్రపో పట్టకపోతే కనుక మధ్యాహ్న సమయంలో నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎవరికైనా సహజంగానే జరుగుతుంది. కానీ మధ్యాహ్న సమయంలో తిన్న వెంటనే ఫుల్లుగా నిద్ర వస్తుంది అంటే.. దీనికి సంకేతాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనినే వైద్య భాషలో ఫుడ్ కోమాగా పేర్కొంటున్నారు వైద్యులు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు ఎంతటి పనిలో ఉన్నా కానీ నిద్రను ఆపుకోలేరు. కళ్ళు మూత పడిపోతూ ఉంటాయి. అంతేకాదు ఆవలింతలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి. ప్రస్తుత ఈరోజుల్లో ఇలాంటి సమస్యను చాలామంది అనుభవిస్తున్నారు. అయితే ఈ సమస్య అనేది ఓ వ్యసనంలాగో, రుగ్మతలాగో ఉంటే మాత్రం దీనిని పోస్ట్‌ప్రాండియల్ సొమ్నోలెన్స్ అని కూడా అంటున్నారు నిపుణులు. నేటి కాలంలో ఈ సమస్య అనేది చాలామందిని వేధిస్తుంది. ఈ బలహీత నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎప్పుడు మార్గాలు ఏంటో కొన్ని విషయాలను తెలుసుకుందాం. షుగర్ లెవల్స్‌పై ప్రభావితం: అయితే ప్రధానంగా పగటిపూట లిమిటేషన్‌కు మించి తినడం, బర్గర్స్, బిర్యానీలు, కేకులు, సమోసాలు, పిజ్జాలు వివిధ రకాలైన చిరుతిన్లు వంటివి అధికంగా తింటే ఫుడ్ కోమా వస్తుందని వస్తుంది. అంతేకాదు దీనివల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను ప్రభావితం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఫుడ్ కోమాకు, పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ వంటి రుగ్మతలకు చెక్ పెట్టాలంటే.. ఎక్కువగా ఆయిల్, బేకరీ ఫుడ్స్,మసాలా వాడిన ఆహారాలుు తినడం, బయటి మార్కెట్లోని ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. హెల్తీ ఫుడ్స్ తో ఫుడ్ కోమా అనే అతినిద్ర సమస్యను దూరం ముఖ్యంగా ప్రధానంగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తింటే కూడా మధ్యాహ్న సమయంలో బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగడం, అతిగా నిద్ర వస్తుంది. ఫలితంగా ఫుడ్ కోమాకు దారి తీస్తుంది. అందుకే అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్న లంచ్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్స్, తాజా పండ్లు వంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఫుడ్ కోమా అనే అతినిద్ర సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మీకు ఎక్కువగా తినే అలవాటు ఉందా..అయితే ఈ సమస్యలు తప్పవు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #sleep #health-benefits #food-coma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి