Soaked Dry Fruits : ప్రపంచంలో జనాభా పెరుగుతున్నట్లే ప్రజల్లో అనారోగ్య సమస్యలు కూడా ఆ విధంగానే పెరుగుతున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో ఉంటున్నారు. దీనికి కారణంగా మనం అనుసరిస్తున్న జీవనశైలి, చెడు ఆహారపుఅలవాట్లు. అందుకే మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నాలుగైదు రకాల డ్రైఫ్రూట్స్ ను నానబెట్టి తినడంవల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
బ్లాక్ కిస్మిస్:
బ్లాక్స్ కిస్మిస్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ మూడు లేదా నాలుగు ఎండు ద్రాక్షలను తినడం మంచిది. ఇప్పటికే మీరు అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నట్లయితే, పెరుగుతో పాటు బ్లాక్ గ్రేప్ పండ్లను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. దీనికి ప్రధాన కారణం ఈ ద్రాక్ష పండులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో సోడియం పరిమాణాన్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: మీ సోదరుడికి రాఖీకట్టే ముందు ఈ నలుగురు దేవుళ్లకు రాఖీ కట్టండి..ఎందుకో తెలుసా?
నానబెట్టిన అంజీర్:
నానబెట్టిన రెండు అంజీర్లను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ డ్రై ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
ఖర్జూరాలు:
మూడు-నాలుగు ఎండు ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎముకలకు సంబంధించిన సమస్య ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ, క్యాల్షియం పుష్కలంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
బాదం:
బాదంపప్పులో కరిగే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంను రోజూ నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతుంది. అలాగే రోజూ ఇలా చేసేవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గి మధుమేహం అదుపులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: పూజాగదిలో ఈ వస్తువులు ఉంటే…లక్ష్మీదేవి మీ నట్టింట్లో ఉన్నట్లే..!!
(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)