Temple: నిమిషంలో 14వేల మంది రాక్షసులను శ్రీరాముడు మట్టుబెట్టిన ప్రాంతం.. ఎక్కడంటే? రాముడు కేవలం 1.5 నిమిషాల్లోనే 14వేల మంది రాక్షసులను చంపిన ప్రాంతం మహారాష్ట్రలోని పంచవటి. ఈ ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి. ఇది రాముడి 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తుందని చెబుతుంటారు. By Jyoshna Sappogula 17 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Panchavati: గత వారం జనవరి 12న మహారాష్ట్ర పంచవటి ప్రాంతంలోని కలారామ్ ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం గురించి భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇతిహాసంలో వివరించిన అనేక ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ జరిగినందున ఈ ప్రాంతం అలాగే దేవాలయం రెండూ రామాయణంతో ముడిపడి ఉన్నాయని చారిత్రక ప్రాముఖ్యతను తెలుపుతున్నాయని ప్రజలు భావిస్తారు. రాముడు కేవలం 1.5 నిమిషాల్లోనే 14,000 మంది రాక్షసులను చంపాడని, అందువల్లే అతను రాక్షసుల కోసం 'కాల్' (మరణం) గా వచ్చినందున ఈ ఆలయాన్ని 'కాలరం' అని పిలుస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి, ఇది రాముడి 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తుందని అంటారు. మన లేపాక్షి గురించి ఈ విషయాలు తెలుసా? మరోవైపు తాజాగా ప్రధాని మోదీ మన ఏపీలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ లేపాక్షీ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది చాలానే ఉంటుంది. లేపాక్షి దేవాలయాన్ని వీరభద్ర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్-అనంతపురం జిల్లాలోని కుగ్రామంలో ఉంది. ఇది అద్భుతమైన వాస్తుశిల్పంతో కట్టిన గుడి. అంతేకాదు కళకు ఉదాహరణ. 'లేపాక్షి' అంటే 'లేపండి ఓ పక్షి' అని అర్థం వస్తుంది. రాముడి భార్య సీతను అపహరించి తన పుష్పక విమానంపై లంకకు తీసుకెళ్తున్న రావణుడితో ఎంతో పోరాడిన రాబందు లాంటి పౌరాణిక పక్షి జటాయుకు నివాళిగా ఈ పట్టణానికి 'లేపాక్షి' అనే పేరు పెట్టారు. రామాయణం ప్రకారం వారి పోరాటంలో రావణుడిచే తీవ్రంగా గాయపడిన జటాయువు పడిపోయిన ప్రాంతం లేపాక్షి అని ప్రజలు నమ్ముతారు. Also Read: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ నేత బొప్పన భవకుమార్.! సీతను రావణుడు అపహరించినట్లు రాముడికి, లక్ష్మణుడుకు జటాయువు తెలియజేశాడు. దీంతో జటాయువుకు రాముడు మోక్షం అనుగ్రహిస్తాడు. లేపాక్షి ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ ఆలయంలో సీతాదేవి పాదముద్రలు భద్రపరచి ఉన్నాయని నమ్ముతారు. ఈ ఆలయలో శివుడు, విష్ణువు, రఘునాథ్, రామునికి అంకితం చేయబడిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయని చెబుతుంటారు. ఆలయాల లోపల ఉన్న వాస్తుశిల్పం విజయనగర రాజవంశంలోని కళాకారుల చేశారు. Also Read: లిఫ్టులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన సెక్యూరిటీ గార్డు..! రిసెంట్ గా లేపాక్షి ఆలయాన్నిప్రధాని మోదీ సందర్శించారు. వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి హారతి ఇచ్చిన మోదీకి ఆలయ విశిష్టతల గురించి అర్చకులు వివరించారు. తర్వాత శ్రీరామ జయ రామ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన కీర్తనలను ఆలపిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి పోయారు మోదీ. దాదాపు 40 నిమిషాల పాటు లేపాక్షి ఆలయ చరిత్ర, విశిష్ఠతను అధికారులు వివరించారు. Also read: రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్ #andhra-pradesh #pm-modi #maharastra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి