Lok Sabha Elections : ఏపీపై బీజేపీకి ఎందుకంత గురి..డిజిటల్ ప్రచారంలో కమలనాథుల వ్యూహం ఏంటి?

ఏపీలో బీజేపీ వ్యూహమేంటీ?డిజిటల్ ప్రచారంలో ఇక్కడే ఎందుకంత ఖర్చు చేస్తోంది?సీఎస్డీఎస్ నివేదికలో ఆశ్చర్యకరమైన అంశాలు. వచ్చే ఐదేళ్లలో ఏపీ లో పాగా వేసేందుకేనా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Lok Sabha Elections : ఏపీపై బీజేపీకి ఎందుకంత గురి..డిజిటల్ ప్రచారంలో కమలనాథుల వ్యూహం ఏంటి?

PM Modi : నరేంద్రమోదీ(Narendra Modi) సారథ్యంలోని బీజేపీ(BJP) ఎలాగైనా ఈసారి 400స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. అందుకు సంబంధించి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతి ఓటు కీలకంలాగా ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. ప్రతి చిన్న అవకాశాన్ని  ప్రచారంగా మలచుకుని  లబ్ది పొందాలని కాషాయం పార్టీ ప్రయత్నిస్తోంది. దీనికోసం డిజిటల్ ప్రచారాన్ని(Digital Campaign) అస్త్రంగా ఎంచుకుంది. ఏప్రిల్ లో బీజేపీ తన ఫండ్స్ లోనుంచి 50శాతం ఏపీలో ఖర్చు చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఉత్తరాదిలో పార్టీ తన వనరుల్లో 11శాతం మాత్రమే ఖర్చు చేసిందట. ఏపీపై బీజేపీ ఎందుకంత గురిపెట్టింది. బీజేపీ వ్యూహాం ఏంటి?తెలుసుకుందాం.

కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని చెప్పవచ్చు. హిందూ ధర్మం, పార్టీ సిద్ధాంతాల విషయంలో ముందుండే  కమలం పార్టీ డిజిటల్ ఫ్లాట్ ఫాంలోనూ ఇతర పార్టీలతో పోలిస్తే ముందుంజలో ఉంటుంది. ఏపీ(AP) లో లోకసభ ఎన్నికలున్న నేపథ్యంలో డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. క్రమంగా యాక్టివిటీని పెంచే పనిలో కేంద్ర నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది.

ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై బీజేపీ నజర్: 

ఈనేపథ్యంలో దక్షిణాదిలో ఇప్పుడు ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు సీఎస్ డిఎస్ నివేదిక పేర్కొంది. పార్టీ తన నిధుల్లో 50శాతం ఏపీకి ఖర్చు చేయగా..30శాతం ఒడిశాకు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఏపీలో మొత్తం 25, ఒడిశాలో 21 లోకసభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒడిశాలో మాత్రం 8 సీట్లు గెలుచుకుంది. గత అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాగైనా మెరుగైన స్థానాలను కైవసం చేసుకోవాలన్న వ్యూహాంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని 6 స్థానాల్లో బరిలోకి దిగుతోంది బీజేపీ. అటు ఒడిశాలో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. అయితే ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ ఆశాజనకమైన సీట్లు వస్తాయన్న ధీమాతో ఉంది.

డిజిటల్ ప్రచారంపై బీజేపీ ఫోకస్: 

ఈ నేపథ్యంలోనే బీజేపీ డిజిటల్ ప్రచారంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఏపీలో భారీగా ఖర్చు చేస్తోంది. ఒక ఏప్రిల్ నెలలోనే డిజిటల్ మీడియా ప్రచారానికి 50శాతం ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బీజేపీ స్థానిక సమస్యలపై 52శాతం ఖర్చు చేస్తే...జాతీయ సమస్యలపై 48శాతం ఖర్చుచేసినట్లు సీఎస్ డీఎస్ నివేదిక చెబుతోంది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ జాతీయ సమస్యలపై 86శాతం, స్థానిక సమస్యలపై 14శాతం నిధులు ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ తన వనరులలో 80 శాతం రూ.10,000 లోపు ప్రకటనలకే ఖర్చు చేసింది. ఒడిశాలో ఈ సంఖ్య 86 శాతం, ఇతర రాష్ట్రాల్లో 55 శాతంగా ఖర్చు చేసింది. భారతీయ జనతా పార్టీ డిజిటల్ ప్రకటనలో మౌలిక సదుపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం మేనిఫెస్టోపై ఎక్కువ దృష్టి పెట్టింది.

మరోసారి మోదీ ప్రభుత్వం  ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌:

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ ఏ హ్యాష్‌ట్యాగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతోంది? CSDS ప్రకారం, కాంగ్రెస్ భారత్ భరోసా, యూత్ జస్టిస్, ఫస్ట్ జాబ్ గ్యారెంటీడ్ యువ రోష్ని ట్రెండింగ్‌లో ఉంది. కాంగ్రెస్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా యువత, నిరుద్యోగులను ఆకర్షించాలని కోరుకుంటోంది. ఇటీవలి CSDS సర్వేలో, 27 శాతం మంది నిరుద్యోగం ప్రధాన సమస్య అని చెప్పారు. ద్రవ్యోల్బణం పేరుతో ఓట్లు వేస్తామని 23 శాతం మంది చెప్పారు.ఇక బీజేపీ ఫర్ డెవలప్‌మెంట్, మోదీ కుటుంబం వంటి హ్యాష్‌ట్యాగ్‌లపై బీజేపీ ఎక్కువ దృష్టి సారించింది. ఇది కాకుండా మరోసారి మోదీ ప్రభుత్వం ఈసారి పార్టీకి 400 దాటి ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌లు ఉన్నాయి.

ఇమేజ్ ద్వారా ఎక్కువగా ఖర్చు చేస్తోన్న బీజేపీ: 

కాంగ్రెస్ వీడియో ఫార్మాట్‌లో ఎక్కువ ఖర్చు చేస్తుంటే..బీజేపీ ఇమేజ్ ద్వారా ఎక్కువ ఖర్చు చేస్తోంది.బీజేపీ 94 శాతం డబ్బును ఇమేజ్ ఫార్మాట్ ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు సీడీఎస్ డి నివేదిక పేర్కొంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే తన పట్టును పెంచుకుంటున్న బీజేపీ..ఏపీలో కూడా పట్టు సాధించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు