Naga Chaitanya – Sobhita : నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది.

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
New Update

Naga Chaitanya – Sobhita : టాలీవుడ్ (Tollywood) లో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ వచ్చిన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ (Engagement) చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఉన్నట్టుండి వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో వీరి పరిచయం, ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది.


Also Read : నాగచైతన్య ‌‌- శోభిత ఫస్ట్ టైమ్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా?

వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది. ఈ జంట మధ్య ఆరేళ్ళ గ్యాప్ ఉందని తెలిసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

#naga-chaitanya-sobhita
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe