Naga Chaitanya – Sobhita : నాగచైతన్య ‌‌- శోభిత ఫస్ట్ టైమ్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా?

అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ఈరోజు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చైతూకు శోభిత పరిచయం అయిందట. చైతుకు..శోభితకు కామన్ గా ఉన్న ఓఫ్రెండ్ బర్త్ డేలో వీరిద్దరూ మొదటి సారి కలుసుకున్నట్లు సమాచారం.

New Update
Naga Chaitanya – Sobhita : నాగచైతన్య ‌‌- శోభిత ఫస్ట్ టైమ్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా?

Naga Chaitanya – Sobhita : టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభిత దూళిపాళ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. నిశ్చితార్థ వేడుకల ఫొటోలను షేర్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఉన్నట్టుండి వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో వీరి పరిచయం, ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం వీరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయిందంటే.. సమంతతో విడాకుల తర్వాత చైతూకు శోభిత పరిచయం అయింది. చైతుకు..శోభితకు కామన్ గా ఉన్న ఓఫ్రెండ్ బర్త్ డేలో వీరు కలిసినట్టు నెట్టింట పెద్ద చర్చ జరిగింది. ఆ బర్త్ డేలోనే వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట.

Also Read : ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4 వచ్చేస్తుంది.. ఈసారి పాన్ ఇండియా స్టార్స్ తో బాలయ్య దబిడి దిబిడే

ఒకరిగురించిమరొకరు మాట్లాడుకోవడం.. తెలుసుకోవడంతో పాటు.. ఆరోజునుంచే కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఓసారి చైతూ ఓ హోటల్లో శోభితతో కనిపించాడు. వీరిద్దరూ హోటల్ లో ఉన్న ఫొటో బయటికి రావడంతో వీరి సీక్రెట్ రిలేషన్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ హోటల్లో చైతూ. శోభిత బర్త్ డే ను సెలెబ్రేట్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అలాగే ఓ సారి చైతూ ప్లాట్ ముందు.. శోభిత కారు అర్ధ రాత్రి ఉండటంతో అప్పటి నుంచి అనుమానం స్టార్ట్అయ్యింది. ఆతరువాత ఫారెన్ టూర్లలో వీరి ఫోటోలు బయటకు రావడం.. కలిసి ఉన్నపిక్స్ వైరల్ అవ్వడంతో.. వీరు డేటింగ్ లో ఉన్నరని ప్రచారానికి బలం చేకూరినట్టు అయ్యింది. కట్ చేస్తే.. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు