ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!!

ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!!
New Update

సాధారణంగా అయితే మనం వండుకున్నవి ఏమైనా మిగిలిపోయినా.. బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి పాడైపోతాయని ఫ్రిడ్జ్ లలో పెడుతూంటాం. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఫ్రిడ్జ్ లలో బాగానే ఉంటున్నాయని.. వారాల తరబడి.. నెలలు తరబడి అలా వదిలేయకూడదు. మనం వండుకున్న ఆహార పదార్థాలైతే.. రెండు రోజులు, అదే కూరగాయలైతే ఓ వారం రోజుల వరకూ కాస్త బాగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆహార పదార్దాలను ఫ్రిడ్జ్ లో పెట్టి, బయటకు తీసి వేడి చేసుకుని తింటుంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను వేడి చేయడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడించారు.

అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం.. ఈ సీజన్ అంటేనే అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా వ్యాధుల బారిన పడుతూనే ఉంటారు. ఇప్పటికే చాలా వరకూ వైరల్ ఫీవర్లు వ్యాపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా.. వీధుల్లో మురుగు పేరుకుపోయి.. దోమల బెడద పెరిగిపోతుంది. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల విజృంభణ ఇప్పుడే మొదలవుతుంది. దీన్ని నివారించాలంటే వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఎప్పడికప్పుడు వండుకుని ఫ్రెష్ గా తినడమే బెటర్ కానీ.. ఇలా ఫ్రిడ్జ్ లలో రోజుల తరబడి.. రెండు, మూడు సార్లు వేడి చేసుకున్న ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. మరి అవేంటో తెలుసుకుందామా.

చికెన్: చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకూ దీనికి ఫ్యాన్స్ ఎక్కువ. సాధారణంగా కోడి మాంసంలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ విషంగా మారుతుందట. దీని వలన ఆహారం జీర్ణం కాక.. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నం: వండిన అన్నాన్ని ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు. మళ్లీ తర్వాత రోజు వేడిచేసుకొని తినొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్ని సార్లు వేడి చేసి తినకూడదు. బయట వాతావరణంలో ఉంచినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.

కూరగాయలు: పాలకూర పప్పు, పాలక్‌ పనీర్‌, పాలకూర పచ్చడి వేడి చేసి తినకూడదు. అలాగే పుట్టగొడుగులను ఒక్కసారే వండుకొని తినాలి. వీటిని కూర వండిన తర్వాత పదే పదే వేడి చేసి తినకూడదు. అలాగే తింటే విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.

#fridge #food #eating #food-items #danger
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe