Eating: ప్రస్తుత కాలంలో స్వీట్లు, కొన్ని జంక్‌కి ఎక్కవగా మక్కువ చూపుతున్నారు. మరి కొందరైతే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని త్వరగా తినే అలవాటు కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం ఆరోగ్యకరమైన ఎంపిక కదంటున్నారు. ఇది ఒక రకమైన తినే రుగ్మత అని వైద్య నిపుణులు అంటున్నారు. వారానికి ఒకసారి అతిగా తింటే.. అతిగా తినే రుగ్మత కలిగి ఉండవచ్చు. ఈ విధంగా తినడం వలన ఆనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ రుగ్మత ఉందని కూడా కొందరికి తెలియదు. ఈ సమయంలో..నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరించబడటం, వ్యక్తి చురుకుగా మారడానికి కారణమవుతుంది, మెదడులోని ఒక భాగం శ్రద్ధ అవసరం అనుభూతి చెందుతుంది, ఇంక భావోద్వేగాలను శరీరం నుంచి విడుదల చేస్తుంది.. ఇవన్నీ ఆహార కోరికలకు దారితీస్తాయి. ఈ కారణంగా వారు పెద్ద మొత్తంలో ఆహారాన్ని త్వరగా తినడం ప్రారంభిస్తారు. అతిగా తినాలనే బలమైన కోరికకు కారణాలు, నివారణ చర్యలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇలాంటి లక్షణాలు ఉంటాయి:
- కడుపు నిండిన తర్వాత తినాలనే కోరిక
- కడుపు సంతృప్తి చెందిన తినటం
- నొప్పి వచ్చే వరకు తినటం
- కొందరూ ఆకలి లేనప్పుడు తినటం
- తిన్న వెంటనే మళ్లీ తినటం
- భోజనానికి సమయం ప్లాన్ లేకపోవటం
- ఇతరుల నుంచి రహస్యంగా తినటం
- ప్రత్యేక ఆహార కోరికలు కలిగి ఉండటం
- ఆహారం గురించే ఆలోచిస్తారు
డిప్రెషన్:
- కొంతమందికి ప్రతిరోజూ ఇలాంటి లక్షణాలు కనిపించవు కానీ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఒత్తిడి, మరేదైనా భావోద్వేగ కారణంగా అతిగా తినాలనే కోరికలు పెరుగుతుంది. దీని వల్ల వచ్చే మొదటి సమస్య ఊబకాయం. ఊబకాయం కారణంగా మధుమేహం, కొవ్వు కాలేయం, రక్తపోటు, కీళ్లనొప్పులు మొదలైన ఇతర వ్యాధులు వస్తాయి. దీని వల్ల డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఉపశమనం కోసం:
- మానసిక చికిత్సతో చేయవచ్చు. ఇందులో యాంటి డిప్రెసెంట్, యాంగ్జయిటీ మందులు కూడా ఇస్తారు. సరైన ఆహార ప్రణాళిక ద్వారా ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే.. ఈ సమయంలో కొంతమంది డైటింగ్ అనేది అతిగా తినడం లక్షణాలు కలుగుతాయని గమనించాలి. అందువల్ల..దీన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల పర్యవేక్షణలో డైటింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చదవండి: పాదాల్లో వాపు ఎందుకు వస్తుంది..సకాలంలో గుర్తించకపోతే అంతేనా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.