Neck Tips : నిద్రపోతున్నప్పుడు మీ మెడను ఎవరైనా నొక్కినట్లు మీకు అనిపిస్తుందా? బీ కేర్ ఫుల్ !! మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తో పాటు నిద్ర కుడా అవసరం . కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఈ రెండిటి మీద సరయిన శ్రద్ధ చూపటం లేదు. ఈ కారణం చేత నిద్రకు సంభందించిన జబ్బులు వస్తాయి. ముఖ్యంగా నిద్ర పక్షపాతం వచ్చే అవకశాలు ఎక్కువగా ఉన్నాయి. By Nedunuri Srinivas 23 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Health : ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతోంది. దానికి తగ్గట్టే మనిషి లైఫ్‌స్టైల్(Human Life Style) ఫాస్ట్ గా మారిపోతోంది. తీరికలేని పనివేళలతో అంతా మెకానికల్ లైఫ్(Mechanical Life) గా మారుతోంది. ప్రతీ క్షణం టెన్షన్. టెన్షన్. ప్రజలకు హాయిగా తినడానికి గాని, నిద్రపోవడానికిగాని సరయిన టైం కేటాయించలేని పరిస్థితి ఎదురవుతోంది. మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మారుతున్న జీవనశైలి కారణంగా, ప్రజలు తరచుగా తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. ఇది అనేక సమస్యలను దారితీస్తుంది. దీని ద్వారా నిద్రకు సంబంధించిన జబ్బులకు గురవుతాం. నిద్రకు సంబంధిచిన జబ్బులలో ప్రధానంగా చెప్పాల్సింది నిద్ర పక్షవాతం గురించి. ఇది ఎవరికైనా రావచ్చు.(Sleep Paralysis) నిద్ర పక్షవాతం వచ్చిన వారు స్పృహలో ఉన్నా సరే కదలలేరు. పైగా నిద్రలో ఎవరో మీ పీక నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. నిద్ర పక్షవాతం అంటే ఏమిటి? చాలా సార్లు, నిద్రలో, మన మెదడు పని చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మన శరీరం అస్సలు పని చేయదు. ఈ పరిస్థితిని వైద్య భాషలో నిద్ర పక్షవాతం .(Sleep Paralysis) అంటారు. నిద్ర పక్షవాతంతో, మీరు స్పృహలో ఉంటారు కానీ కదలలేరు. ఒక వ్యక్తి మేల్కొలుపు మరియు నిద్ర యొక్క దశల మధ్య వెళుతున్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ మార్పుల సమయంలో, మీరు కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు కదలలేరు లేదా మాట్లాడలేరు. కొందరు వ్యక్తులు ఒత్తిడి లేదా ఊపిరాడకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. సరళమైన భాషలో చెప్పాలంటే, నిద్ర పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలో లేవలేడు, మాట్లాడలేడు. నిద్ర పక్షవాతం సమయంలో ఆయా వ్యక్తులకు పరిసరాల గురించి తెలుసుకునే మెలుకువ ఉంటుంది. కానీ కదలలేరు, మాట్లాడలేరు. కానీ .. కళ్ళను కదిలించవచ్చు , శ్వాస తీసుకోవచ్చు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఆయా వ్యక్తులకు విపరీతమెయిన భయం కలుగుతుంది. ఒక రకంగా చనిపోయారనే ఆలోచనకి వెళ్ళిపోతారు. నిద్ర పక్షవాతం ఏ వయస్సులోనైనా ప్రభావితం చేయవచ్చు. నిద్ర పక్షవాతం యొక్క కారణాలు * నిద్రలేమి *నార్కోలెప్సీ *ఆందోళన రుగ్మత * డిప్రెషన్ * బైపోలార్ డిజార్డర్ *పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్(PTSD) * అధిక ఒత్తిడి *పేలవమైన జీవనశైలి నిద్ర పక్షవాతం యొక్క లక్షణాలు *మాట్లాడలేకపోవడం లేదా శరీరాన్ని కదిలించడం *నెగెటివ్ ఎనర్జీ అనుభూతి చెందుతుంది *గదిలో ఎవరైనా ఉన్నారనే భావన *చనిపోయిన ఫీలింగ్ *ఛాతీ మరియు గొంతుపై ఒత్తిడి *ఊపిరి పీల్చుకున్న అనుభూతి *మీ మనస్సులో చీకటి నీడను చూడటం *శ్వాస ఆడకపోవుట నివారణ, చికిత్సా మార్గాలు మీరు తిరిగి నిద్రలోకి జారుకున్నప్పుడు లేదా పూర్తిగా మేల్కొన్నప్పుడు కొన్ని నిమిషాల్లో నిద్ర పక్షవాతం చివరిదశకు వస్తుంది. అయితే దేనికి సాధారణంగా చికిత్స అవసరం లేదు. చాలా మంది వ్యక్తులు నిజంగా ప్రమాదంలో లేరని గ్రహించిన తర్వాత వారికి దానిని ఎదుర్కోవచ్చని అర్ధమౌతుంది. మీరు నిద్ర పక్షవాతంతో బాధపడుతున్నట్లయితే, మీరు ఈ క్రింది వాటిని పాటించాలి- *తగినంత నిద్ర పోవాలి. - పడుకునే ముందు ఆల్కహాల్ మరియు కెఫిన్ వినియోఫం మానేయడం చాలా ఉత్తమం. *ఒత్తిడిని తగ్గించుకోండి *నిద్ర పోవడానికి ఓ షెడ్యూల్ చేయండి ఇవండీ.. నిద్ర పక్షపాతంతో ఉన్న సమస్యలు. ఇలాంటివి ఎదురయినప్పుడు ఖచ్చితంగా నిపుణులైన వైద్యుల పర్వవేక్షణలో ట్రీట్ మెంట్ చేయించుకోవాలి. ALSO READ : మీరు 30 ప్లస్ అయితే .,ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! #health-issues #sleeping-disorder #sleep-paralysis #daily-life మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి