Strong Teeth: దంతాలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి ఆహారం మరియు ఇతర పానీయాలు తీన్నప్పుడు పొట్టకంటే ఎక్కువగా సమస్య వచ్చేది పళ్లకే. అతి వేడి, చల్లని పదార్థాలు తినే సమయంలో దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్ తొలగిపోతుంది. దీంతో తొందరగా దంతాలు పాడవుతాయి. అందుకని కొన్ని జాగ్రత్తలు అవసరమని దత్త వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Benefits: సరైన ఆహారం తినకపోతే దత్త సమస్యలు వస్తాయని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. పుచ్చిన దంతాలతో కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. మరి కొందరికి ఎప్పుడూ చిగుళ్లు వాచిపోతూ ఉంటాయి. ఈ లక్షణాలకు కారణాలు ఉన్నాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినాలో డాక్టర్లు సూచిస్తున్నారు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పదార్ధాలు తింటే దంతాలకు మంచిది డ్రై ఫ్రూట్స్‌లో మినరల్స్, ఫైబర్, విటమిన్స్, మెగ్నిషియం, కాల్షియం దంతాలు పాడుకాకుండా ఉపయోగిస్తాయి. అంతే కాకుండా పళ్లపై బ్యాక్టీరియా చేరకుండా ఇవి ఎక్కువగా కాపాడతాయి. చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చిగుళ్లు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి. సుగర్ ఫ్రీ చ్యూయింగ్ గమ్‌ను తినటం వలన లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని దంత నిపుణులు చెబుతున్నారు. పాలు, పెరుగు, చీజ్ వంటి పదార్థాల్లో కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి బలమైన దంతాలకు, చిగుళ్లకు ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు మనం ఆహారం తిన్న తర్వాత కొన్ని పదార్థాలు నోటిలో ఉంటాయి. వీటిని వెంటనే శుభ్రం చేసుకోకపోతే నోట్లో రకరకాల సమస్యలు వస్తాయి. కూరగాయలు, పళ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలపై ఉన్న బ్యాక్టీరియాను, పాచిని తొలగించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్స్‌లో ఉండే మాలిక్ యాసిడ్- దంతాలపై పొరను శుభ్రం చేస్తోంది. వీటిలో ఉండే విటమిన్లు.. ఇతర పోషకపదార్థాలు దంతాలను, చిగుళ్లను బలోపేతం చేయడంలో బెస్ట్ అని అంటున్నారు. రోజులో తరచూ నీటిని తాగితే నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరి నోటిని శుభ్రం చేస్తుంది ఇది కూడా చదవండి: కాకరకాయ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా..? అయితే జాగ్రత్త రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఒక నిమిషం పళ్లు తోముకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ..రెండు నిమిషాలు తోముకున్నా మంచిదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. నోటిలో, పళ్లు, చిగుళ్లకు అంటుకుని ఉండే ఫంగస్‌లు, బ్యాక్టీరియా, వైరస్‌లను ఎక్కువగా తొలగించుకోవాలంటే 4 నుంచి 5 నిమిషాలు బ్రష్ చేసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు పళ్లు సరిగా తోముకోకపోయినా.. తగినంత సమయం బ్రష్ చేసుకోకపోయినా.. నోటిలో ఫంగస్‌లు, వైరస్, బ్యాక్టీరియాలు ఎక్కువ పెరుగుతాయి. దీంతో అది మన రోగనిరోధక శక్తితో పాటు మంట, చిగుళ్లవాపు వంటి సమస్యలు వస్తాయి. అయితే, సాధారణంగా ఈ ఇన్‌ఫ్లమేషన్‌తో నొప్పి ఉండదు. కానీ.. పళ్లు తోముకుంటున్న టైంలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. కొన్నిసార్లు నోటి నుంచి దుర్వాసన వస్తుందని దంత వైద్యులు అంటున్నారు. #health-benefits #healthy-teeth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి