Potato: బంగాళాదుంపలను మనం తరచుగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వేపుళ్లు, కూరల్లో వాడుతారు. కొందరు వెజ్ బిర్యానీ చేసుకుంటూ ఉంటారు. అయితే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలు అస్సలు తినొద్దని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటి ఉంటే బంగాళాదుంపలు తినకూడదని చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
రక్తపోటు సమస్య ఉన్నవారు
బంగాళాదుంపలు తినడం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందుకే తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఆలుగడ్డపై గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకున్న వెంటనే మన శరీరంలో గ్లూకోజ్‌ను అధికంగా విడుదల చేస్తుంది. దీని కారణంగా మన రక్తంలో చక్కెర స్థాయిలు రెండింతలు అవుతాయి. అందుకే షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా బంగాళాదుంపలు తినకూడదు.
బరువు తగ్గాలనుకుంటే మాత్రం..
శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం ఆలుగడ్డలు తింటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయని తేలింది. అందుకే ఈ సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకునేవారు ఆలుగడ్డలను నిర్భయంగా తినవచ్చు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం దూరంగా ఉండాలని అంటున్నారు. బంగాళాదుంపలు తింటే బరువు తొందరగా పెరుగుతారు. డైట్ పాటించేవారు మాత్రం ఆలుగడ్డలను అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీ కళ్లకు వచ్చే సమస్యలు తగ్గాలంటే ఈ ఆకు రసం ట్రై చేయండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: యాపిల్ టీ తాగండి.. ఆ సమస్య దూరం అవ్వకపోతే అడగండి!