USA: అమెరికాలో ఎన్నికల వేడి..ప్రసంగాలకు రెడీ అవుతున్న డెమోక్రటిక్ అభ్యర్థులు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పుడు డెమోక్రాటిక్ అభ్యర్థులు ప్రసంగాల షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు.

New Update
USA: అమెరికాలో ఎన్నికల వేడి..ప్రసంగాలకు రెడీ అవుతున్న డెమోక్రటిక్ అభ్యర్థులు

DNC Speaker Schedule: డెమోక్రాటిక్ పార్టీ నుంచి కీలక వ్యక్తులు ప్రసంగాలను చేయనున్నారు. 2024 డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమలా హారిస్, ఉపాధ్యక్షడు టిమ్ వాల్ట్స్‌తో పాటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్లింటన్‌లు కూడా మాట్లాడనున్నారు. ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సమన్వయంలో ఈ ప్రసంగాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కమలా హారిస్‌ను డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా నామినేట్ చేస్తారు. ఇందులో పోటీ నుంచి తప్పుకున్న ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడ ప్రసంగిస్తారని చెబుతున్నారు.

ఈ డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవనుంది. ఇందులో నాలుగు రోజుల పాటూ రాజకీయ నాయకులందరూ ప్రసంగాలు చేస్తారు. కమలా హారిస్ తన ఉపాధ్యక్షుడుగా టిమ్ వాల్ట్స్‌ను కూడా ఇందులోనే ధృవీకరిస్తారు. ఈసమావేశాలు చికాగోలో జరగనున్నాయి. అధ్యక్ష అభ్యర్ధి అయిన కమలా హారిస్ ఇక్కడ నుంచే పోటీ చేయనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ సమన్వయంతో మొత్తం 50 రాష్ట్రాలు, ఇతర ప్రదేశాల నుంచి డెమోక్రటిక్ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవనున్నారు. అయితే ఎవరెవరు ఏఏ రోజులు మాట్లాడతారనేది ఇప్పటిరకు అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ఆగస్టు 22న ఒబామా ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇందులో ఆయన కమలా హారిస్‌కు మద్దతు తెలపనున్నారు. ఇక టిమ్ వాల్ట్స్ ఆగస్టు 21 మాట్లాడాల్సి ఉంది.

Also Read:Google Pixel Phones: గూగుల్ పిక్సెల్ 9 విడుదల..ధర, ఫీచర్లు ఇవే..

Advertisment
తాజా కథనాలు