/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sdr-jpg.webp)
New Year 2024 Celebrations : నూతన సంవత్సరం(New Year 2024) వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంతోపాటు ఇతర పట్టణాలు, గ్రామాల్లోనూ డ్రగ్స్, మద్యం, తదితర అంశాలపై ఇప్పటికే ఫోకస్ చేసిన అధికారులు.. శనివారం కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్, వైన్ షాప్, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు ఈవెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రజలు, పార్టీ నిర్వహాకులను ఉద్ధేశిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకల్లో అవుట్ డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరు బాధ్యతాయుతంగా సహకరించాలి. ట్రాఫిక్, ఎస్‌వోటీ, పెట్రోలింగ్ బృందాలతో పాటు మహిళలపై వేధింపులు నిరోధించేందుకు షీ టీమ్(She Team) బృందాలు ఎప్పటికప్పుడూ నిగ పెడుతుంటాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ లేకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయానికి అన్ని మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే ఆయా దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ వయసువారికి థియేటర్ లోకి నో ఎంట్రీ
అలాగే వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలన్న సీపీ కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి 90 శాతం ఫ్లై ఓవర్లు మూసివేస్తామని, అవసరం అయితే తప్పా ప్రజలు బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇష్యూ చేయొద్దని హెచ్చరించారు.