TS Police Warning: పండుగకు ఉరెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే మీ ఇల్లు ఖాళీ..!!
దసరా పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో ప్రజలంతా తమ తమ ఊళ్లకు వెళ్తున్నారు. పండగ సీజన్ కదా..దొంగలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. దాని కోసం డబ్బు కావాలి. అందుకే పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లపై కన్నేస్తారు. ఉన్నదంతా దోచేస్తుంటారు. ఇంతకుముందు అయితే ఇలా పండగల సమయంలో పోలీసులు ఇళ్లపై దృష్టి సారించేవారు. దొంగతనాలు జరగకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం. పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఇది దొంగలకు మంచి సమయం. దొరికనకాడికి దోచుకెళ్తారు. మీరు ఇలా వెళ్లాగానే...వాళ్లు అలా వచ్చేస్తారు. అందుకే పండగకు ఊరెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.