Diwali Wishes 2023: మీ ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!!

చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా...చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. మీ ఆత్మీయులకు, ప్రియమైనవారికి సింపుల్ గా కాకుండా "ఆర్టీవీ" అందిస్తున్న ప్రత్యేకమైన కోట్స్ తో గ్రీటింగ్స్ చెప్పండి.

New Update
Diwali Wishes 2023: మీ ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!!

చీకటి వెలుగుల రంగేళి...జీవితమే ఒక దీపావళి...అంటూ పాడుకునేందుకు దేశం మొత్తం సిద్ధమయ్యింది. ఈ పండుగ రోజున...ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో మిలామిలా మెరిసిపోతుంది. ప్రతిఇంట్లో లక్ష్మీ పూజ సుగంధాలు వెదజల్లుతుంటాయి. వాడవాడలా బాణసంచా మోతలు మారుమ్రోగుతుంటాయి. ఇలాంటి పండుగ సందడి వేళ...మీ ఆత్మీయులకు లేదా ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. దీనికోసమే ఆర్టీవీ ప్రత్యేకమైన కోట్స్ మీకోసం అందిస్తుంది.

1. దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

2. దీపకాంతుల జ్యోతులతో, సిరిసంపదల రాసులతో, టపాసుల వెలుగులతో దీపావళి శుభాకాంక్షలు.

3. మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఈ దీపావళి వెలుగుల్లో కనుమరుగవ్వాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

4. లక్షమీ కాంతులతో..
సిరి ఇంట చేరంగ..
వెలుగుల సంపదలు..
మన ఇంట కురవంగ...
వచ్చెను దీపావళి పండుగ..
తెచ్చెను ఆనందం నిండుగా...మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

5. ప్రతి క్షణం బంగారు పువ్వులు వికసించాయి,

మీరు ఎప్పుడూ ముళ్లను ఎదుర్కోకూడదు.

మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది,

దీపావళి సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.

6. అష్టైశ్వర్యాల నెలవు, ఆనందాల కొలవు, సర్వదా మీకు కలుగు, దీపావళి శుభాకాంక్షలు.

7. లక్ష్మీదేవి అమ్మవారి దేవెనలు మనతో ఉండాలని కోరకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

8. ఈ దీపావళికి మీ ఇంట కురిపించాలి సిరులపంట, మీరంతా ఆనందంగా ఉండాలంట, అందుకోండి శుభాకాంక్షల మూట. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

9. టపాసుల కేళి...ఆనందాల రవళి...ప్రతి ఇంటా జరగాలి...ప్రభవించే దీపావళి.

10. లక్ష్మీ మీ ఇంట నర్తించగా, సంతోషం పాలై పొంగగా దీపకాంతులు, వెలుగునీయంగా, పండుగను ఆనందంగా జరుపుకోండి. దీపావళి శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి: దీపావళి పండుగకు అభ్యంగన స్నానం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు