Diwali: తేదీ ఏదైనా రానివ్వండి..అక్కడ మాత్రం ఆ రోజే దీపావళి!

కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం దీపావళి పండుగను వాయిదా వేస్తున్నాయి. పండుగను బుధవారం నాడు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

New Update
Diwali: తేదీ ఏదైనా రానివ్వండి..అక్కడ మాత్రం ఆ రోజే దీపావళి!

తెల్లవారితే దీపావళి..ఎప్పుడెప్పుడు పండగ చేసుకుందామా..పిల్లలతో కలిసి టపాసులు కాల్చుదామా అని దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం పండుగను వాయిదా వేస్తున్నాయి. పండుగను బుధవారం నాడు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

మూడు తరాలుగా ఆ గ్రామాల ప్రజలు పండుగను ఇలాగే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. చామరాజ్‌నగర్‌ జిల్లా గుండ్లుపేట్‌ తాలుకాలోని వీరనాపూర్‌, బన్నితలాపూర్‌, ఇంగల్వాడి, మాద్రహళ్లి, మళవళ్లి, నెనెకట్టే గ్రామాల్లో ఈ దీపావళి పండుగను బుధవారం చేసుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. మంగళవారం నాడు బలి పాడ్యమి రావడం వల్ల వారు పండుగనే వాయిదా వేశారు.

దీపావళి, బలి పాడ్యమి రెండు కూడా బుధవారం రోజు వస్తేనే పండుగ చేసుకుంటామని తెలిపారు. లేకపోతే బలి పాడ్యమి తరువాత వచ్చే బుధవారం నాడు పండుగను నిర్వహించుకుంటామని తెలిపారు. ఇలా బుధవారం నాడు పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని గత మూడు తరాల నుంచి ఆచరిస్తున్నామని గ్రామస్థులు వివరించారు.

పండుగను బుధవారం కాకుండా వేరే రోజున చేసుకుంటే ఏదైనా కీడు జరిగి.. పశువులకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు. గతంలో బుధవారం కాకుండా.. సాధారణ రోజుల్లో పండుగ జరుపుకున్నప్పుడు గ్రామస్థులకు చెందిన ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. అందుకే పెద్దలు బుధవారం రోజున పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు.

Also read: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా!

Advertisment
తాజా కథనాలు