సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రవేశ పెట్టడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 15 సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కష్టపడి పని చేశానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంతా తాను ముందుకు నడిపించానని గుర్తు చేశారు. 70 సంవత్సరాల వ్యక్తికి మూడు సార్లు అవకాశం ఇచ్చినా తాను ఓపికగా ఉన్నానని, పార్టీ గెలుపుకోసం పని చేశానని తెలిపారు. పార్టీ కొసం కష్టపడి పని చేసిన వారిని కేసీఆర్ పట్టించకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు
రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి టికెట్లు దక్కకపోవడం బాధాకరమన్నారు.
Translate this News: