రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్లు రాకపోవడంతో బీఆర్ఎస్‌ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి టికెట్లు దక్కకపోవడం బాధాకరమన్నారు.

New Update
రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రవేశ పెట్టడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేత నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 15 సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కష్టపడి పని చేశానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంతా తాను ముందుకు నడిపించానని గుర్తు చేశారు. 70 సంవత్సరాల వ్యక్తికి మూడు సార్లు అవకాశం ఇచ్చినా తాను ఓపికగా ఉన్నానని, పార్టీ గెలుపుకోసం పని చేశానని తెలిపారు. పార్టీ కొసం కష్టపడి పని చేసిన వారిని కేసీఆర్‌ పట్టించకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్‌ సందించారు. తాను ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడ్డ వారిని టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమని రేఖ శ్యాం నాయక్ అన్నారు. రానున్న 90 రోజులు తాను ఎమ్మెల్యేనన్న ఆమె.. ఈ 90 రోజులు ప్రజల మధ్య తిరుగుతానని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనపై మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డానన్న ఆయన.. ఒక్కసారి ఓడిపోయిన మాత్రాన తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు వీరేశం క్యాంపు కార్యాలయానికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. అనుచరులతో వీరేశం సమావేశమయ్యారు. తన భవిష్యత్‌ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని వేముల వీరేశం స్పష్టం చేశారు. కాగా ఈ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  

రాజాసింగ్ కామెంట్స్

గోషామహల్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. కేసీఆర్‌ ఎంఐఎంకు భయపడుతున్నారని ఆరోపించారు. గోషామహల్‌ అభ్యర్థిపై ఎంఐఎం నేతలుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఎద్దేవా చేశారు. ఎఐఎం పార్టీ నేతలు ఎవరికి టికెట్‌ ఇవ్వాలంటే కేసీఆర్ వాళ్లకే ఇస్తారని విమర్శించారు. గతంలో గోషామహల్‌లో పోటీ చేసిన ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ కూడా ఎంఐఎం పార్టీ రిఫెర్‌ చేసిన అభ్యర్థేనని రాజాసింగ్‌ గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ పెద్దల అశిర్వాదం తనకేం ఉందన్న ఆయన రానున్న ఎన్నికల్లో సైతం విజయం సాధించేది తానని జోస్యం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు