KTR on Double Bed Rooms: వచ్చే వారమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్!

డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
KTR on Double Bed Rooms: వచ్చే వారమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్!

KTR on Double Bed Rooms: డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ (Pragathi Bhavan) లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కాగా, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిని ఐదారు దశల్లో వేగంగా అందిస్తామన్నారు. ఇక వచ్చే వారంలోనే మొదటి దశ డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, పద్మారావు ఇంకా జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో..!

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందేట్టుగా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే.. కీలక పథకమైన డబుల్ బెడ్ రూం పథకాన్ని (Double Bed Room Scheme) విడతల వారీగా ఎన్నికల సమయం కంటే ముందు పంపిణీ చేయాలని ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అదే విధంగా బతుకమ్మ చీరలను కూడా ఎన్నికల కోడ్ కంటే ముందే ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బతుకమ్మ పండుగక్కి నెల రోజుల ముందే బతుకమ్మ చీరలను (Bathukamma Sarees) ఊరూరా పంచడానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో అదే విధంగా పంద్రాగష్టు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్.

Also Read: అనంతగిరి కొండల్లో జోరుగా కార్‌, బైక్‌ రేసింగ్‌లు.. దుమ్ము రేపిన రేసింగ్‌ రాయుళ్లు

Advertisment
తాజా కథనాలు