AP : ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్!

ఏపీ వైసీపీ ఎంపీ మార్గని భరత్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజమండ్రి సిద్ధం సభలో అప్పారావుకు భరత్ రెడ్డి చెప్పు చూపించి సవాల్ విసిరారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మంటూ ఆదిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

AP : ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్!
New Update

Rajahmundry : ఏపీ వైసీపీ(YCP) ఎంపి మార్గని భరత్ vs మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజమండ్రి(Rajahmundry) సిద్ధం సభ(Siddam Sabha) లో ఆదిరెడ్డి అప్పారావుకి చెప్పు చూపించి మాస్ వార్నింగ్ ఇచ్చారు భరత్ రామ్. సిద్ధం సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిల ముందే చెప్పుల రాజకీయాలకు తెరలేపారు.

వాళ్ల జోలికి వస్తే ఊరుకోం..

ఈ మేరకు ఆదిరెడ్డి అప్పారావు(Adireddy Apparao) వాలంటరీతో మాట్లాడిన ఆడియో టేపును సభలో వినిపించి రెచ్చిపోయిన భరత్.. మా వాలంటరీ చెల్లెమ్మల జోలికి వస్తే ఇకపై చెప్పుతో సమాధానం చెబుతామని ఆదిరెడ్డికి కుటుంబానికి సవాల్ విసిరాడు. చిన్న సైకిల్ తో వచ్చి, అద్దె ఇంట్లో ఉంటూ ఆస్తులు ఎలా వచ్చాయని భరత్ మండిపడ్డారు. వడ్డీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన నువ్వు రాజమండ్రిలో అడ్డదారులు తొక్కి ఆర్థికంగా ఎలా ఎదిగావంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రిలో 15సం మీ పాలనలో ఒక్క అభివృద్ధి పనిచేసారా? అంటూ భరత్ కోపంతో ఊగిపోయారు. వాలంటీర్లు అందరూ నా తోబుట్టువులు, తమ్ముళ్లు వారి జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి : Jagtial: ప్రేయసిని చంపేందుకు వచ్చిన యువకుడిని కొట్టి చంపిన బంధువులు!

ఒళ్ళు దగ్గర పెట్టుకో..

అయితే సిద్ధం సభ అనంతరం RTVతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. మార్గని భరత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఓ పిల్ల బచ్చా. నేనేంటో? మా సంపాదన ఏంటో? మీ తండ్రిని అడుగమంటూ మండిపడ్డారు. మీ తండ్రి ముఖం చూసి ఇప్పటిదాకా నిన్ను వదిలేసాను. మొన్న కూడా మీ నాన్న నాకు ఫోన్ చేసి మా వాడిని కాపాడమని బ్రతిమిలాడుకున్నాడు. నేను రాజమండ్రి కి సైకిల్ మీద వచ్చిన మాట వాస్తవమే. నువ్వు మోరంపూడి సెంటర్లో బ్రాందీ సీసాలు అమ్ముకోలేదా? మీ తండ్రి వయసు ఉన్న వాడిని కదా.. నాకు చెప్పు చూపిస్తావా? నువ్వు ఒక చెప్పు చూపిస్తే... ఇక్కడ 40,000 మంది కార్యకర్తలు రెండు చెప్పులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ... నీ ప్రగల్భాలు నా దగ్గర కాదు. నీ బతుకెంతా మాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్లీ చెప్తున్నా.. ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాజమండ్రిలో ఓడిపోతానని ముందే తెలుసుకున్నావు. అందుకే నీకు ఇంత ఫ్రస్టేషన్. దమ్ముంటే నా ముందు వచ్చి మాట్లాడు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. నా ముందా.. నీ కుప్పిగంతులేయకు. ఖబడ్దార్ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు అప్పారావు.

గత కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ తన పెళ్లిల ప్రస్థాన విషయంలో వైసిపి(YCP) నేతలకు చెప్పు చూపించిన విషయం తెలిసిందే. కాగా దానికీ పేర్ని నాని(Perni Nani) రెండు చెప్పులు చూపించటం గతంలో హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ అదే చెప్పుల రాజకీయ పేర్ని నాని రాజమండ్రి సభలో ఉండగానే మొదలవ్వటం రాజమండ్రిలో చర్చనీయాంశమైంది.

#adireddy-apparao #ap-ycp #ycp-siddam-sabha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe