Directors Day 2024 : గ్రాండ్ గా డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్.. ఆ డైరెక్టర్స్ తో పాటూ హీరోలు కూడా మిస్సింగ్!

టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో పాటూ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, వంటి దిగ్గజ దర్శకులు మిస్సయ్యారు.

Directors Day 2024 : గ్రాండ్ గా డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్.. ఆ డైరెక్టర్స్ తో పాటూ హీరోలు కూడా మిస్సింగ్!
New Update

Directors Day 2024 Event : టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డే సందర్భంగా మే 19 న ఈ వేడుక జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో సీనియ‌ర్ న‌టుడు ముర‌ళి మోహ‌న్ తో పాటు యంగ్ హీరోస్ నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, కార్తికేయ వంటి హీరోలు పాల్గొన్నారు.

ప్రతీ ఏడాది దాసరి నారాయణరావు బర్త్ డే సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ కి ఆహ్వానం అందింది. కానీ ఈసారి వీళ్ళెవరూ ఈ ఈవెంట్ కి రాలేదు.

ఆ డైరెక్టర్స్ మిస్సింగ్

హీరోలే కాదు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి దిగ్గజ దర్శకులు సైతం హాజరుకాకపోవడంతో ఈ సారి జరిగిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కి కళ తప్పిందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అనీల్ రావిపూడి పేర‌డీ స్కిట్ లు ఆడియన్స్ ను అల‌రించాయి.

ఈ కార్యక్రమంలో..మ్మారెడ్డి భరద్వాజ, ఎస్వీ కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బుచ్చిబాబు, మారుతి, ఎన్ శంకర్, మెహర్ రమేష్, బలగం వేణు, చంద్రమహేష్,అచ్చిరెడ్డి, వంటి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#allu-arjun #directors-day-event-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe