Directors Day 2024 : గ్రాండ్ గా డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్.. ఆ డైరెక్టర్స్ తో పాటూ హీరోలు కూడా మిస్సింగ్! టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో పాటూ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, వంటి దిగ్గజ దర్శకులు మిస్సయ్యారు. By Anil Kumar 20 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Directors Day 2024 Event : టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డే సందర్భంగా మే 19 న ఈ వేడుక జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో సీనియర్ నటుడు మురళి మోహన్ తో పాటు యంగ్ హీరోస్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, కార్తికేయ వంటి హీరోలు పాల్గొన్నారు. ప్రతీ ఏడాది దాసరి నారాయణరావు బర్త్ డే సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ కి ఆహ్వానం అందింది. కానీ ఈసారి వీళ్ళెవరూ ఈ ఈవెంట్ కి రాలేదు. ఆ డైరెక్టర్స్ మిస్సింగ్ హీరోలే కాదు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి దిగ్గజ దర్శకులు సైతం హాజరుకాకపోవడంతో ఈ సారి జరిగిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కి కళ తప్పిందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అనీల్ రావిపూడి పేరడీ స్కిట్ లు ఆడియన్స్ ను అలరించాయి. ఈ కార్యక్రమంలో..మ్మారెడ్డి భరద్వాజ, ఎస్వీ కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బుచ్చిబాబు, మారుతి, ఎన్ శంకర్, మెహర్ రమేష్, బలగం వేణు, చంద్రమహేష్,అచ్చిరెడ్డి, వంటి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Delightful snapshots of Icon Star @alluarjun and Natural Star @NameisNani from the “Directors Day 2024” event at LB Stadium!📸#AlluArjun #Nani #Pushpa2TheRule #SaripodhaaSanivaaram #TeluguFilmNagar pic.twitter.com/bRVeRPbLc1 — Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2024 #allu-arjun #directors-day-event-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి