Director Vivek Agnihotri : అలాంటి సినిమాలకు సెన్సార్‌ అవసరం లేదు.. కంగనాకు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సపోర్ట్

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కంగనాకు మద్దతుగా నిలిచారు. సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్‌ చేయకూడదని, తన అభిప్రాయాన్నితెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Director Vivek Agnihotri : అలాంటి సినిమాలకు సెన్సార్‌ అవసరం లేదు.. కంగనాకు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సపోర్ట్
New Update

Director Vivek Agnihotri :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది.

దీంతో సెన్సార్ బోర్డ్‌ ఈ సినిమాకు సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సెన్సార్‌షిప్‌పై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ పోస్ట్‌ను కంగనా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు." సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్‌ చేయకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ మీరు అన్నిటినీ సెన్సార్‌ చేయాలని భావిస్తే.. టీవీ చర్చలు, వార్తా కార్యక్రమాలు, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు.. ఇలాంటి వాటిని కూడా సెన్సార్‌ చేయాలి.

Also Read : సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్

ఎందుకంటే ఇవి ద్వేషం, హింసలకు నిజమైన మూలాలు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేక కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడం కూడా మానేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీసే విమర్శలను కూడా స్వీకరించి.. వాటిని మన బలంగా మార్చుకోవాలి. పిరికి వాళ్లు తమకు అనుకూలంగా ఉన్నవాటికి మాత్రమే సెన్సార్‌ చేస్తున్నారు" అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

#actress-kangana-ranaut #director-vivek-agnihotri
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe