Director Surya Kiran: డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్‌ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

New Update
Director Surya Kiran: డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ కన్నుమూత

Director Surya Kiran Passed Away: ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్‌ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో సత్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత రాజుభాయ్‌, ధన 51 చిత్రాలను తీశారు. బిగ్‌ బాస్‌ లో సూర్య కిరణ్‌ పాల్గొన్నారు.

సూర్యకిరణ్ మాస్టర్‌ సురేష్‌ అనే పేరుతో సుమారు 200 పైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగానూ యాక్ట్ చేశాడు. నటి సుజిత సూర్య కిరణ్‌ కు సోదరి అవుతుంది. నటి కల్యాణితో ప్రేమ వివాహం విఫలం అయ్యింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ పెళ్లైన కొద్ది సంవత్సరాలకే విడిపోయారు.

updated soon...

Advertisment
తాజా కథనాలు