Shankar : ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' పై అప్డేట్ ఇచ్చిన శంకర్..! డైరెక్టర్ శంకర్ తాజాగా 'గేమ్ చేంజర్' పై అప్డేట్ ఇచ్చాడు.‘ఇండియన్ 2’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడారు." సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా" అని అన్నారు. By Anil Kumar 27 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Director Shankar Gives Update On Game Changer Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా నుంచి ఒక్క సాంగ్ తప్పితే మరో అప్డేట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ శంకర్ స్వయంగా 'గేమ్ చేంజర్' పై అప్డేట్ ఇచ్చాడు. ఇంకా 10 రోజులే మిగిలుంది... ‘ఇండియన్ 2’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడారు. " సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది. 'ఇండియన్ 2' రిలీజ్ కాగానే ‘గేమ్ ఛేంజర్’ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్పై ఓ నిర్ణయం తీసుకుంటా. సాధ్యమైనంతవరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా" అంటూ చెప్పుకొచ్చాడు. Also Read : ప్రభాస్ ‘కల్కి’ మూవీ చూసేందుకు థియేటర్ కు వచ్చిన అకీరా, రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న వీడియో! ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. #ram-charan #game-changer-movie #director-shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి