Shankar : 'గేమ్ ఛేంజర్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది : శంకర్

డైరెక్టర్ శంకర్ 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'గేమ్ ఛేంజర్' మూవీ గురించి మాట్లాడారు. 'ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది' అని అన్నారు.

New Update
Shankar : 'గేమ్ ఛేంజర్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది : శంకర్

Director Shankar About Game Changer Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో 'గేమ్ ఛేంజర్' మూవీ గురించి మాట్లాడారు.

ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.." నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆమేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది" అని పేర్కొన్నారు.

Also Read : ‘భారతీయుడు 2’ పై కోర్టులో కేసు.. రిలీజ్ వాయిదా?

గేమ్ ఛేంజర్ మాస్ మూవీ అని స్వయంగా శంకర్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా 'గేమ్ ఛేంజర్' పోస్టర్స్ ను నెట్టింట పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తుండగా.. SJ సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు