Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు!

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డాయి. షేక్‌ హసీనా తండ్రి రెహమాన్‌ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు. ఈ అమానవీయ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు!
New Update

Bangladesh Crime : రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లు, అంతర్గత రాజకీయ సంక్షోభం (Political Crisis) తో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ (Bangladesh) లో మరో దారుణం జరిగింది. ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) ను లక్ష్యంగా చేసుకొని హింసాకాండకు పాల్పడ్డ అల్లరిమూకలు దారుణానికి ఒడిగట్టాయి. ఓ యువ నటుడు శాంతో ఖాన్‌, దర్శకుడైన అతడి తండ్రి సలీమ్‌ ఖాన్‌ను అతికిరాతకంగా కొట్టి చంపిన ఘటన ప్రపంచాన్ని కలిచివేస్తోంది.

అయితే హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్‌ను సలీమ్‌ ఖాన్‌ (Salim Khan) తెరకెక్కించడంతో పాటు అతని కొడుకు శాంతో (Santo Khan) ను హీరోగా పెట్టడమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. 2021లో ‘తుంగిపరార్‌ మియా భాయ్‌’ పేరుతో నిర్మించిన మూవీలో సలీమ్‌ కుమారుడు శాంతో.. హసీనా తండ్రి రెహమాన్‌ యుక్తవయసు పాత్రను పోషించాడు. బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ జీవితం, కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన సంఘటనల ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన దర్శకనిర్మాత ఓ సినిమాను తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి: Paris Olympics: భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు!

ఈ సినిమాతో శాంతో ఖాన్‌ కెరీర్‌ మలుపుతిరిగింది. చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే వీరిపై పలువురు కక్షగట్టగా ఇదే అదనుగా వెంటపడి కొట్టి చంపేశారు. తండ్రీకుమారులు చాంద్‌పుర్‌లోని తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం వీరు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వీరి మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

#santo-khan #salim-khan #bangladesh #political-crisis
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe