RGV: ఆర్జీవీ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ .. మూవీ పేరేంటో తెలుసా..? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవిత కథ ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. By Archana 21 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి RGV Planning For Uday Kiran Biopic: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి ఆయన సినిమాలు. అందరికీ బిన్నంగా ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరలు అవుతుంటారు. ఇటీవలే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా వ్యూహం సినిమాను (Vyooham Movie) తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. Also Read: Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో ఆర్జీవీ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ అయితే ఈ సంచలన డైరెక్టర్ మరో కొత్త బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దివంగత టాలీవుడ్ నటుడు ఉదయ కిరణ్ జీవిత కథను (Uday Kiran Biopic) సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఉదయ్ కిరణ్ ఒకరు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన కొంత కాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా ఎదుగుతారని భావించిన ఉదయ్.. అనూహ్యంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఉదయ్ మరణించి ఇంత కాలం గడిచిన ఇప్పటికీ ప్రేక్షకుల్లో హృదయాల్లో ఆయన పేరు నిలిచిపోయింది. Also Read: Pushpa 2: శ్రీవల్లి ఏంటీ ఇలా ఉంది .. పుష్ప 2 నుంచి లీకైన రష్మిక లుక్..! #uday-kiran-biopic #rgv-planning-biopic-on-hero-uday-kiran #rgv #ram-gopal-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి