/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-6-12.jpg)
Director Krishna Vamshi Gives Strong Reply to Netizen : సూపర్ స్టార్ మహేష్ బాబ్ - కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన 'మురారి' అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లోనే ఎవరు గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ 'మురారి ప్లాప్ మూవీ' అని వ్యాఖ్యానించడంతో కృష్ణవంశీ ఆ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
"హలో అండీ.. నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్‌లో 1 కోటి 30 లక్షలు కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, సినిమా ఫ్లాఫ్ లేదా సూపర్‌హిట్ మీరే నిర్ణయించుకోండి సర్. ధన్యవాదాలు" అని అన్నారు. అంతేకాకుండా 'మురారి' మూవీకి తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని.. మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటని తెలిపారు.
Hellllloooooo helloo Andi .. I bought MURARI for east godavari from producer N RAMALINGESWRAO garu for 55lks for 5 years .. I got 1 crore 30 lks in d first run Andi ... If collections r d measure then u decide sir whether it's FLOP r superhit ,. THQ somuch sir ❤️🙏 GOD BLESS https://t.co/0aLr53uTtq
— Krishna Vamsi (@director_kv) July 20, 2024
Also Read : ‘బిగ్ బాస్’ సీజన్ – 8 అప్డేట్ వచ్చేసింది.. ప్రోమో అదిరిపోయిందిగా, ఈసారి హోస్ట్ ఎవరంటే !
కొందరు వ్యక్తులు నెగెటివ్ కామెంట్లు చేసినా, మనం సంయమనం పాటించాలంటూ మరో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. 'వాళ్ల బతుకులు అవి.. మన సంస్కారం ఇది. వాళ్లను క్షమించండి. వదిలేయండి. ఎవరినీ కించపరచవద్దు. అర్థం చేసుకుని దయతో మెలగండి' అంటూ చెప్పుకొచ్చారు. పొరపాటున మనం బ్యాలెన్స్ కోల్పోతే వాళ్లు విజయం సాధించినట్లు అంటూ సమాధానం ఇచ్చారు.